Manchu Family: ఇద్దరు.. పేర్లు విస్మరించారు

ABN , Publish Date - Jul 08 , 2024 | 08:44 PM

మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య మనస్పర్థలున్నాయని మరోసారి తేలింది. ఆ మధ్య మంచు మనోజ్‌కి తన సోదరుడు మంచు విష్ణుకి మధ్య గొడవ జరిగిందని సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అయింది.


మంచు ఫ్యామిలీలో (manchu Family) అన్నదమ్ముల మధ్య మనస్పర్థలున్నాయని మరోసారి తేలింది. ఆ మధ్య మంచు మనోజ్‌కి (manoj) తన సోదరుడు మంచు విష్ణుకి (Manchu Vishnu) మధ్య గొడవ జరిగిందని సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అయింది. ఆ తర్వాత అది తాము కలిసి చేస్తున్న ఒక షో కోసం అని చెప్పుకొచ్చారు. కానీ చాలా రోజులుగా అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదనేది టాలీవుడ్‌ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. ఇప్పుడు ఆ ప్రచారానికి సొంత అన్నదమ్ములే మరోసారి ఊతం ఇచ్చినట్లయింది. ఇటీవల మంచు మనోజ్‌కి పాప పుట్టిన సంగతి తెలిసిందే! ఆ పాపకి దేవసేన శోభ ఎంఎం అనే పేరు పెడుతూ ఒక నోట్‌ రిలీజ్‌ చేశారు. అయితే ఆ పేరు ఎందుకు పెట్టాం అనేది వివరిస్తూ ఒక లెటర్‌ రాసి ఆ లెటర్లో తల్లిదండ్రులు మోహన్‌ బాబు, నిర్మలాదేవి అక్క మంచు లక్ష్మి సహా మౌనిక రెడ్డి, అక్క, తమ్ముడు గురించి కూడా ప్రస్తావించారు. అయితే ఈ లేఖలో మంచు విష్ణు గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. తన అన్న విష్ణు గురించి కావాలనే మనోజ్‌ విస్మరించినట్లు తెలుస్తోంది.

Invite.jfif

అలాగే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్కన ప్రణీత్‌ వ్యవహారం గురించి సాయిధరమ్‌ తేజ్‌ ఫైర్‌ అవుతూ పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల  ముఖ్యమంత్రులకు పోలీస్‌ డిపార్‌మెంట్‌కు అభ్యర్థించారు. ఆ తర్వాత స్పందన మంచు మనోజ్‌దే. వినోదం పేరుతో ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు మనోజ్‌. అయితే సాయిధరమ్‌ తేజ్‌ చేసిన పోస్ట్‌కు మంచు విష్ణు రిప్లై ఇచ్చారు. 'థ్యాంక్స్‌ బ్రదర్‌' అని సాయిధరమ్‌ తేజ్‌ను ట్యాగ్‌ చేశారు. ఈ విషయంపై స్పందించి ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేస్తాం అని రిప్లై ఇచ్చిన తెలంగాణ డీజీపీకి కూడా కృతజ్ఞతలు తెలిపారు. కానీ ఇదే సమస్యపై స్పందించిన తన సోదరుడు మనోజ్‌ను కనీసం ట్యాగ్‌ చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదాలు అలాగే ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

Updated Date - Jul 08 , 2024 | 08:56 PM