Manoj Manchu, Rohith Nara: వారిని ఎట్టి పరిస్థితుల్లో వ‌ద‌ల‌కండి! మంచు మ‌నోజ్‌, నారా రోహిత్

ABN , Publish Date - Jul 08 , 2024 | 10:58 AM

పిల్లల ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేయడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కోరుతూ హీరో సాయి దుర్గా తేజ్‌నిన్న ఓ పోస్టు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై మ‌రో హీరో మంచు మ‌నోజ్,నారి రోహిత్, విశ్వ‌క్ సేన్‌ తీవ్ర స్థాయిలో స్పందించారు.

manchu nara

సోషల్‌ మీడియా (Social Media) ప్రమాదకరంగా మారిందని, పిల్లల ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేయడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కోరుతూ హీరో సాయి దుర్గా తేజ్‌ (Sai durga tej) త‌న ఎక్స్‌లో పోస్టు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై మ‌రో హీరో మంచు మ‌నోజ్, నారి రోహిత్, విశ్వ‌క్ సేన్‌ స్పందిస్తూ తీవ్ర స్థాయిలో సీరియ‌స్ అయ్యారు.

వారు త‌మ‌ పోస్టుల్లో.. కామెడీ, ట్రోలింగ్‌, రోస్టింగ్‌ ముసుగులో.. సోష‌ల్‌మీడియాలో చిన్న పిల్ల‌లు, వారి త‌ల్లిదండ్రుల‌పై దారుణ‌మైన వీడియోలు చేస్తున్న వారిని చూస్తుంటే జుగుప్ప , ఆస‌హ్యం క‌లుగుతోంద‌న్నారు.ప్ర‌స్తుతం ఈ సంస్కృతి బాగా పెరుగుతుంద‌ని, కొంత‌మంది ఫ్యామిలీ ప‌ర్స‌న‌ల్ వీడియోల‌ను తీసుకుని చిన్న పిల్ల‌లు అని కూడా చూడ‌కుండా ట్రోలింగ్ పేరుతో త‌మ ఇష్టానుసారంగా అస‌భ్య ప‌ద‌జాలం వాడుతూ కామెంట్లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.


రానురాను ఈ ఘ‌ట‌న‌లు పెరిగి భ‌విష్య‌త్ ప్ర‌మాద‌క‌రంగా మాట్లాడే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. గ‌తంలోనే నేను స‌ద‌రు వ్య‌క్తికి పిల‌ల్ల‌పై జ‌రుగుతున్న‌ అఘాయిత్యాల‌పై చేయాల్సిన పోరాటం గురించి సంప్ర‌దిస్తే స్పందించ‌లేద‌ని తిరిగి ఇప్పుడు అత‌నే పిల‌ల్ల‌పై అస‌భ్య‌క‌రంగా మాట్లాడని మంచు మ‌నోజ్‌ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి నీచుల‌ను అస‌లు వ‌దిలి పెట్టోద్ద‌ని వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ రెండు రాష్ట్ర ప్రభుత్వాల‌కు, అమెరికన్ ఎంబ‌సీకి ట్వీట్ చేశారు.

అయితే ఈ సంబంధిత ఘ‌ట‌న‌పై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క స్పందించారు. ఇప్ప‌టికే బాధ్యుల‌పై FIR న‌మోదు చేశామ‌ని, సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకోబోతున్న‌ట్లు వెళ్ల‌డించారు. ఇదిలాఉండ‌గా ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన స‌ద‌రు యూ ట్యూబ‌ర్ కూడా స్పందించాడు.. అ వీడియో చేయ‌డం పెద్ద మిస్టేక్ అని ద‌య‌చేసి క్ష‌మించండి అంటూ ఓ వీడియో విడుద‌ల చేయ‌గా ఆ అంశం, ఆ వీడియో సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి.


Updated Date - Jul 08 , 2024 | 11:43 AM