MayDay: ‘మే డే’ స్పెషల్‌గా అప్పటి వీడియోను షేర్ చేసిన చిరంజీవి.. అందులో ఏముందంటే?
ABN , Publish Date - May 01 , 2024 | 11:44 AM
కార్మికుల దినోత్సవం స్పెషల్‌గా పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 22 సంవత్సరాల క్రితం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కోసం ఆయన చేసిన ఈ వీడియోలో.. పసి పిల్లలని పని పిల్లలను చేయవద్దనే మెసేజ్‌ని మెగాస్టార్ ఇస్తున్నారు.
కార్మికుల దినోత్సవం (MayDay) స్పెషల్‌గా పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 22 సంవత్సరాల క్రితం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) కోసం ఆయన చేసిన ఈ వీడియోలో.. పసి పిల్లలని పని పిల్లలను చేయవద్దనే మెసేజ్‌ని మెగాస్టార్ ఇస్తున్నారు. ఈ వీడియో 22 సంవత్సరాల నాటిదే అయినప్పటికీ.. ఇప్పటికీ అంటే మే డేకి (1stMay) రిలవెంట్ అనిపించి షేర్ చేసినట్లుగా మెగాస్టార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. (#InternationalLaborDay)
*Allu Ramalingaiah: అల్లుకి హాస్యనటుడిగా అవార్డు ఎప్పుడు వచ్చిందో తెలుసా?
‘‘22 సంవత్సరాల క్రితం.. పసి పిల్లలని పని పిల్లలుగా చేయవద్దని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) కోసం చేసిన ‘చిన్ని చేతులు’ క్యాంపెయిన్. ఈ రోజుకీ రిలవెంట్ అనిపించి షేర్ చేస్తున్నాను. సే నో టు చైల్డ్ లేబర్. అందరికీ మే డే శుభాకాంక్షలు’’ అని మెగాస్టార్ చిరంజీవి తెలుపుతూ.. అప్పటి వీడియోని షేర్ చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాస్టార్ ట్వీట్‌కు ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతూ.. గొప్ప వ్యక్తిత్వం ఉంటేనే సమాజాన్ని కూడా కుటుంబంలా భావిస్తారంటూ చిరంజీవి (Chiranjeevi)పై ప్రశంసలు కురిపిస్తూ.. మే డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. (Megastar Chiranjeevi May Day Wishes)
మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ (Vassishta) దర్శకత్వంలో ‘విశ్వంభర’ (Vishwambhara) అనే చిత్రాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 2025 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిరంజీవి సరసన త్రిష (Trisha) నటిస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎమ్.ఎమ్ కీరవాణి (MM Keeravani) సంగీతం అందిస్తున్నారు. (#MayDay)
Read Latest Cinema News