Chaitu Sobhita Wedding: నాగచైతన్య, శోభితాల పెళ్లికి తేదీ ఫిక్సయింది.. ఎప్పుడంటే
ABN , Publish Date - Oct 30 , 2024 | 10:42 PM
అక్కినేని కుటుంబంలో పెళ్లి బాజాలు మోగే సమయం ఆసన్నమైంది. ఇటీవల యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళల నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. నిశ్చితార్థం అనంతరం పెళ్లి తేదీ చెబుతారని అంతా అనుకున్నారు కానీ.. అలా జరగలేదు. తాజాగా వారి పెళ్లి ఎప్పుడనేది క్లారిటీ వచ్చేసింది. చైతూ శోభితల పెళ్లి ఎప్పుడంటే..
అక్కినేని కుటుంబంలో పెళ్లి బాజాలు మోగే సమయం ఆసన్నమైంది. ఇటీవల యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళల నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. నిశ్చితార్థం అయితే జరిగింది కానీ.. పెళ్లి ఎప్పుడు అనేది ఇంత వరకు క్లారిటీ లేదు. తాజాగా వారి పెళ్లి తేదీ ఖరారైనట్లుగా అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ తెలియజేశారు. నాగచైతన్య-శోభితాల పెళ్లి డిసెంబర్ 4న గ్రాండ్‌గా జరగబోతోంది. ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లలో ఇరు కుటుంబాల సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక పెళ్లి తేదీకి సంబంధించి ఇరు కుటుంబాల సభ్యులు మంచి ముహూర్తం చూసుకుని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. (Naga Chaitanya and Sobhita Dhulipala Wedding Date)
Also Read-Jai Hanuman: ‘జై హనుమాన్’లో హనుమంతుడిగా ఎవరంటే.. లుక్ వచ్చేసింది
అప్పట్లో విదేశాల్లో ఓ రెస్టారెంట్‌లో వెయిటర్‌కు నాగచైతన్య (Naga Chaitanya) ఇచ్చిన ఫొటోలో శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) కనిపించడంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారన్న విషయం బయటపడింది. దానిపై ఎక్కడా ఇద్దరూ స్పందించలేదు. ఆ ఫొటో బయటకు వచ్చిన తర్వాత వారిద్దరిపై రకరకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఇలా వార్తలు నడుస్తున్న క్రమంలోనే వీరిద్దరూ ఫ్యామిలీ మెంబర్స్‌కి విషయం చెప్పి.. వారి ప్రేమను నిశ్చితార్థం వరకు తీసుకెళ్లారు. వారిద్దరికీ నిశ్చితార్థం జరిగిన విషయాన్ని స్వయంగా కింగ్ నాగార్జునే సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఆగస్ట్ 8న చైతూ-శోభితల నిశ్చితార్థం కుటుంబ సభ్యుల, సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
నిశ్చితార్థం అనంతరం పెళ్లి ఎప్పుడనే దానిపై ఇరు కుటుంబాల వారు క్లారిటీ ఇవ్వలేదు. రీసెంట్‌గా శోభిత తన ఇన్‌స్టాగ్రమ్ వేదికగా షేర్ చేసిన ఫొటోలతో.. చైతూ-శోభిత పెళ్లి పనులు మొదలైనట్లుగా హింట్ అయితే వచ్చింది. ‘గోధుమ రాయి పసుపు దంచటం.. ఇక ఆరంభమైంది’ అంటూ పెళ్లికి సంబంధించిన సాంప్రదాయాలకు అనుగుణంగా మా పెళ్లి జరుగుతుందనేలా శోభిత ఫొటోలను షేర్ చేశారు. అప్పుడు కూడా పెళ్లి ఎప్పుడనేది శోభిత చెప్పలేదు. దీంతో నెటిజన్లు వారి పెళ్లి తేదీకి సంబంధించి వార్తలు వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చైతూ-శోభితల పెళ్లి తేదీపై వస్తున్న వార్తలతో అక్కినేని ఫ్యామిలీ కూడా డిసెంబర్ 4న మ్యారేజ్ అన్నట్లుగా ధ్రువీకరించింది. దీంతో అక్కినేని అభిమానులు కాబోయే నూతన జంటకు శుభాకాంక్షలు చెప్పడం మొదలెట్టారు. అయితే పెళ్లి తేదీ అయితే తెలిసింది కానీ.. పెళ్లి ఎక్కడ? ఎలా చేయబోతున్నారనేది తెలియాలంటే మాత్రం అక్కినేని ఫ్యామిలీ నుండి అధికారిక ప్రకటన రావాల్సిందే.