కుమారుడి పెళ్లిలో కన్నీటితో కూలబడిన స్టార్ యాక్టర్
ABN , Publish Date - Nov 08 , 2024 | 06:45 PM
కుమారుడి పెళ్లిలో కన్నీటితో కూలబడ్డారు స్టార్ యాక్టర్. కుమారుడికి పెళ్లయితే మంచిదే కదా.. మరి ఎందుకు కన్నీరు పెట్టుకోవడం. అందులోనూ పెళ్లి కొడుకు తండ్రి కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటి? అనే అనుమానాలు రావడం సహజమే. మరి ఆలస్యమెందుకు.. ఈ కన్నీటి వెనుక కథేంటో తెలుసుకుందాం పదండి..
కుమారుడి పెళ్లిలో కన్నీటితో కూలబడ్డారు స్టార్ యాక్టర్. ఇంతకీ ఎవరా యాక్టర్? ఏమా కన్నీటి కథ? అనుకుంటున్నారా? ఆ వివరాల్లోకి వెళితే.. తమిళ నటుడు నెపోలియన్ (Napoleon) గుర్తున్నాడు కదా. జపాన్‌లో ఆయన కొడుకు ధనూష్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి ఫొటోలు విడుదలై ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. పెళ్లయితే మంచిదే కదా.. మరి ఎందుకు కన్నీరు పెట్టుకోవడం. అందులోనూ పెళ్లి కొడుకు తండ్రి కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటి? అనే అనుమానాలు రావడం సహజమే. ఈ కన్నీటి వెనుక కథ తెలియాలంటే.. ఫస్ట్ నెపోలియన్ కుమారుడు ధనూష్ గురించి తెలుసుకోవాలి.
Also Read-Mahesh Babu: మహేష్ బాబుకి తేజ సజ్జా, రానా ఎందుకు సారీ చెప్పాలి
నటుడు నెపోలియన్‌కు ఇద్దరు కుమారులు ధనూష్ మరియు కునాల్. ఇందులో నెపోలియన్ పెద్ద కుమారుడు ధనూష్‌కు చిన్నప్పటి నుంచి మస్కులర్ డిస్ట్రోఫీ అనే అరుదైన వ్యాధి ఉంది. ఒకానొక దశలో వ్యాధి తీవ్రమై ధనూష్‌కి పదేళ్లకు పైగా నడవలేని పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత సిద్ధ వైద్య పద్ధతిలో చికిత్స అందిస్తోన్న నెపోలియన్.. కొడుకుకు కావాల్సిన వైద్య సదుపాయాలు అమెరికాలోనే ఉండడంతో కుటుంబంతో సహా అమెరికా వెళ్లి స్థిరపడ్డారు.
కొన్నేళ్ల క్రితం యూట్యూబర్ ఇర్ఫాన్ నెపోలియన్ ఇంటికి వెళ్లినప్పుడు నెపోలియన్‌కి తన కొడుకుపై ఉన్న ప్రేమ ఏ స్థాయిలో ఉందో వెలుగులోకి వచ్చింది. నెపోలియన్ కొడుకు ధనూష్.. ఇర్ఫాన్‌కి వీరాభిమాని కాబట్టి, అతన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఇర్ఫాన్ అతని ఇంటికి వెళ్లి అమెరికాలో తన కుమారుడి కోసం నెపోలియన్ కట్టించిన ప్యాలెస్ వీడియోను విడుదల చేశాడు. ఈ వీడియో చూసిన చాలా మంది ఓ తండ్రికి కొడుకుపై ఇంత ప్రేమ ఉంటుందా.. అని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నెపోలియన్ ఆ ఇంట్లో కొడుకుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూర్చాడు.
Also Read- Dil Raju: మిమ్మల్ని మీరే ప్రూవ్ చేసుకోవాలి.. ఎవడూ మీ వెంట రాడు
ఇప్పుడు తన కుమారుడి పెళ్లిని అంబానీ కంటే గొప్పగా జపాన్‌లో జరిపించాడు. ఈ పెళ్లిలో నెపోలియన్ ఎమోషనల్ అయ్యారు. అసలు తన కుమారుడికి నయం అవుతుందా? అని ఎంతో కాలంగా బాధపడిన తను.. అతని సంతోషం కోసం ఎన్నో సమకూర్చడం విశేషం. ఇప్పుడా కుమారుడికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించి.. సినిమాలలో చూపించినట్లుగా ఆనంద భాష్పాలతో కూలబడినట్లుగా తెలుస్తోంది. తిరునల్వేలికి చెందిన అక్షయ అనే అమ్మాయితో ధనూష్ వివాహం జరిగింది. ఈ వివాహానికి దగ్గరి బంధువులతో పాటు తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. మొదటి నుండి జపాన్ వెళ్లాలనే డ్రీమ్ ఉన్న తన కొడుకుకి.. జపాన్‌లో వివాహం జరిపించి.. తండ్రిగా తన గొప్పతనాన్ని చాటుకున్నారు నెపోలియన్.