Niharika: అది మూర్ఖత్వమే.. మళ్లీ పెళ్లి చేసుకుంటా కానీ..
ABN , Publish Date - Mar 16 , 2024 | 09:52 AM
ఈ మధ్య నిహారిక ఎక్కడికి వెళ్లినా.. మళ్లీ పెళ్లి చేసుకుంటారా? అంటూ అంతా ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆమెకు ఇలాంటి సంఘటనే ఎదురైంది. అయితే ఈసారి ఆమె మాట దాట వేయకుండా.. రెండో పెళ్లి చేసుకుంటానని ఖరాఖండీగా చెప్పేసింది. అంతేకాదు, ఎందుకు రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందో కూడా క్లారిటీ ఇచ్చింది.
ప్రేమ, పెద్దల వివాహాల గురించి ఒకప్పుడు బాగా వినిపించేది. ప్రేమ వివాహాలు అంటే పెద్దలు భయపడిపోయేవారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు అయితే బలంగా ఉంటాయని, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుందని అప్పట్లో పెళ్లి విషయంలో మాట్లాడుకునేవారు. కానీ, ప్రస్తుత జనరేషన్ మాత్రం.. ప్రేమ వివాహమైనా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా.. వారి మధ్య వచ్చిన చిన్న చిన్న మనస్పర్థలను కూడా తట్టుకోలేకపోతున్నారు. కొందరు బలవన్మరణాలకు పాల్పడుతుంటే.. మరికొందరు చట్టప్రకారం విడాకులు తీసుకుని.. వారికి నచ్చిన వారిని మరో వివాహం చేసుకుంటున్నారు. ఇది అమ్మాయిలలోనూ, అబ్బాయిలలోనూ జరుగుతుంది. అలాంటి స్వేచ్ఛను మన చట్టాలు కల్పించాయి. సరే.. ఇదంతా ఎందుకంటే.. మెగా డాటర్ నిహారిక (Mega Daughter Niharika) తాజాగా తన రెండో పెళ్లికి సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
ఈ మధ్య నిహారిక ఎక్కడికి వెళ్లినా.. మళ్లీ పెళ్లి చేసుకుంటారా? అంటూ అంతా ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆమెకు ఇలాంటి సంఘటనే ఎదురైంది. అయితే ఈసారి ఆమె మాట దాట వేయకుండా.. రెండో పెళ్లి చేసుకుంటానని ఖరాఖండీగా చెప్పేసింది. అంతేకాదు, ఎందుకు రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందో కూడా క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆమె పేరు మరోసారి వార్తలలో హైలెట్ అవుతోంది. ఇంతకీ నిహారిక ఏం చెప్పిందంటే.. (Niharika Comments on Second Marriage)
‘‘నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు కావాలంటే కచ్చితంగా పెళ్లి చేసుకోవాలిగా. ఇద్దరిమధ్య రిలేషన్షిప్ వర్కౌట్ కాలేదంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. అలాంటి కారణాలతోనే నా పెళ్లి కూడా వర్కౌట్ కాలేదు. అలా అని జీవితాంతం సింగిల్‌గా ఉంటానని అనుకోవడం కానీ, మళ్లీ ఒకరిపై ప్రేమ పుట్టదనికానీ అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. మళ్లీ పెళ్లి ఎప్పుడనేది చెప్పలేను కానీ పెళ్లయితే చేసుకుంటాను’’ అని నిహారిక (Niharika) చెప్పుకొచ్చింది. అయితే ఆమె నిర్ణయాన్ని కొందరు సమర్ధిస్తుంటే.. మరికొందరు మాత్రం మనసు నొచ్చుకునేలా కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*Venkatesh Daughter: ఘనంగా వెంకీ రెండో కుమార్తె వివాహం.. ఫొటోలు వైరల్
**************************
*Bramayugam: ఓటీటీలోకి వచ్చేసిన మెగాస్టార్ సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ చిత్రం
**************************
*Hanuman OTT: ఏందయ్యా ఇది.. ఈ ఊరించడమేంటి? ఇంట్రెస్ట్ పోతోంది..
****************************