Venu Swamy: వేణు స్వామికి షాక్.. రెండోసారి మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు

ABN , Publish Date - Nov 08 , 2024 | 12:59 PM

వేణు స్వామికి మ‌రోసారి షాక్ త‌గిలింది. నాగచైతన్య, శోభితల జాత‌కం అంటూ చేసిన వీడియో క‌సు విష‌యంలో మ‌హిళా క‌మిష‌న్ రెండోసారి నోటీసులు జారీ చేసింది.

Venu Swamy

నాగచైతన్య (Naga Chaitanya), శోభిత (Sobhita Dhulipala) ల భ‌విష్య‌త్ ఇదే అంటూ జాత‌కం చెప్పి తీవ్ర వ్య‌తిరేఖ‌త‌ను ఎదుర్కొన్న వేణు స్వామి (Venu Swamy) కి మ‌రోసారి షాక్ త‌గిలింది. ఊమెన్ కమిషన్ రెండో సారి ఆయ‌న‌కు నోటీసులు పంపించింది. ఈ నెల 14 వ తేదీన కమిషన్ ముందు హజరవ్వాలని అందులో కోరింది. ఇప్పుడీ వార్త అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ ఇష్యూ మ‌రోమారు వెలుగులోకి వ‌చ్చింది.

వివ‌రాల్లోకి వెళితే.. నిత్యం సెల‌బ్రిటీల జాత‌కాలు చెబుతూ వివాదాల్లో ఉండే అస్ట్రాల‌జ‌ర్ వేణుస్వామి (Venu Swamy) ఇటీవ‌ల అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ జ‌రిగిన త‌ర్వాత‌ వారి జాతకాలను విశ్లేషిస్తూ.. ఈ జంట ఎక్కువ రోజులు క‌లిసి ఉండ‌లేరు, రెండు మూడు సంవ‌త్స‌రాల‌లోనే విడిపోతారని.. అది కూడా ఒక అమ్మాయి వళ్ల‌ అంటూ ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలోతెగ వైర‌ల్ అయి తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.

Venu Swamy


ఈ నేప‌థ్యంలో చాలామంది బాహాటంగానే వేణుస్వామి (Venu Swamy) ని తిడుతూ పోస్టులు పెట్టి ఎడా పెడా వాయించేశారు. కొంత‌మంది పోలీస్ స్టేష‌న్ల‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్ర‌మంలో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్‌లు రియాక్ట్ అయి తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి నీరెళ్ల శారదను క‌లిసి వేణు స్వామిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు.

దీంతో కమిషన్ ముందు హ‌జ‌రు కావాల‌ని శ్రీమతి నీరెళ్ల శారద వేణు స్వామికి తొలుత ఓ నోటీసు పంప‌గా దానికి ఎదుట హజరవ్వకుండా వేణు స్వామి కోర్టును ఆశ్రయించ‌డంతో అప్పుడు అత‌నికి రిలీఫ్ ల‌భించింది. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ఆ స్టేను కోర్టు ఎత్తివేయ‌డంతో మహిళా కమిషన్ మరోసారి వేణు స్వామికి నోటీసులు జారీ చేసి ఈ నెల 14 వ తేదీన కమిషన్ ముందు హజరవ్వాలని ఆదేశించింది. చూడాలి మ‌రి వేణు స్వామి ఇప్పుడైనా క‌మీష‌న్ ముందుకు వెళ‌తారో లేదో.

Updated Date - Nov 08 , 2024 | 12:59 PM