Chiru-Odela: బాస్‌కి నేచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల బ్లడ్ ప్రామిస్.. ఆ చెయ్యి బాస్‌దే కానీ..
ABN , Publish Date - Dec 04 , 2024 | 12:48 PM
మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో నేచురల్ స్టార్ నాని ఓ సినిమాను సమర్పించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి మరో పోస్టర్‌ని వదిలి.. ‘రెడ్ ఫాంట్’కి అర్థం ఏమిటో చెప్పారు నాని మరియు శ్రీకాంత్ ఓదెల. ఇంతకీ ఆ ‘రెడ్ ఫాంట్’ అర్థం ఏమిటంటే..
మంగళవారం సాయంత్రం నేచురల్ స్టార్ నాని బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ అంటూ మెగాస్టార్ చిరంజీవి- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ ఫిల్మ్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఈ సినిమాను తనే సమర్పించబోతున్నట్లుగా కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాని చేస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్ర నిర్మాత సుధాకర్ చెఱుకూరితో కలిసి నాని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వాస్తవానికి ఈ వార్త రెండు రోజుల ముందే లీకైంది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది కూడా. అయితే నిజంగా శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి సినిమా ఉంటుందా? అనే అనుమానాలను చాలా మంది వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ మూవీని అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్‌ని నాని విడుదల చేశారు. రెడ్ ఫాంట్‌లో ఉన్న ఈ పోస్టర్‌లో ఒక చేతి నుండి బ్లడ్ పడుతూ ఉంది. ఈ రెడ్ ఫాంట్ పోస్టర్‌కి గల కారణం ఏమిటో తర్వాత చెబుతానంటూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
Also Read-Megastar Chiranjeevi: వింటేజ్ మెగాస్టార్.. బాసూ, ఆ సీక్రెట్ ఏంటో చెప్పొచ్చుగా
ఆయన చెప్పినట్లే బుధవారం మరో పిక్ వదిలి.. ఈ రెడ్ ఫాంట్‌కి అర్థం ఇది శ్రీకాంత్ ఓదెల ఇస్తున్న ‘బ్లడ్ ప్రామిస్’ అంటూ చిరు, శ్రీకాంత్ ఓదెల ఇద్దరూ కలిసి రక్తంలో తడిసిన చేతులను ప్రామిస్ చేస్తున్నట్లుగా పట్టుకున్న పిక్‌ని వదిలారు. ఈ పిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది శ్రీకాంత్ ఓదెల ‘ఫ్యాన్ బాయ్ సంభవం’ అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటే.. ఒక నెటిజన్ మాత్రం మొదట వదిలిన అనౌన్స్‌మెంట్ పిక్‌లో ఉన్నది నీ చెయ్యేకదన్నా.. అంటూ కామెంట్ చేశాడు.
ఈ కామెంట్‌కి శ్రీకాంత్ ఓదెల సమాధానం ఇస్తూ.. ‘మీ పరిశీలన నాకు ఎంతగానో నచ్చింది. కానీ మీరు అనుకున్న దానిలో నిజం లేదు. అది తప్పు. అది మన బాస్ చిరంజీవిగారి చెయ్యే. కానీ, ఆయన చేతికి ఉన్న బ్రాస్‌లెట్స్ మాత్రం నాది, నాని అన్నది. ఇది మా ఫస్ట్ కాంబినేషన్. ఆ చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో’ అని పోస్ట్ చేశారు. శ్రీకాంత్ ఇచ్చిన ఈ సమాధానంతో మెగా ఫ్యాన్స్ అంతా యమా హ్యాపీగా ఉన్నారు. ‘మాస్ యాక్షన్ సంభవం లోడింగ్’ అంటూ తమ ఆనందం తెలియజేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల, నానితో చేస్తున్న మూవీ పూర్తవ్వగానే మొదలుకానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి తన ‘విశ్వంభర’ చిత్రం పూర్తి చేసి ఈ సినిమా కోసం రెడీ కానున్నారు.