Pushpa 2- Mumbai: 'పుష్ప-2’ థియేటర్‌లో ఘాటైన స్ప్రే.. దగ్గు.. వాంతులు..
ABN , Publish Date - Dec 06 , 2024 | 03:13 PM
ముంబయిలో ఈ చిత్రం ప్రదర్శితమవుతోన్న థియేటర్‌లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఓ వ్యక్తి థియేటర్‌లో ఘాటైన స్ప్రే (mysterious spray) కొట్టడంతో ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు.
అల్లు అర్జున్ (Pushpa 2) కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప: ది రూల్’ (Allu arjun) చిత్రం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకువచ్చింది. తాజాగా ముంబయిలో ఈ చిత్రం ప్రదర్శితమవుతోన్న థియేటర్‌లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఓ వ్యక్తి థియేటర్‌లో ఘాటైన స్ప్రే (mysterious spray) కొట్టడంతో ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు. గురువారం రాత్రి బాంద్రాలోని ఓ థియేటర్‌లో సెకండ్ షో జరుగుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఘాటైన స్ప్రే కొట్టారు. దీంతో ప్రేక్షకులు దగ్గు, వాంతులతో ఇబ్బందులు పడ్డారు. థియేటర్ యాజమాన్యం కాసేపు షోను నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించారు. హాలుకు చేరుకున్న పోలీసులు ప్రతి ఒక్కరినీ తనిఖీ చేశారు. ఇంటర్వెల్ సమయంలో బయటకు వచ్చి తిరిగి లోపలికి వెళ్లిన తర్వాత అందరికీ దగ్గు వచ్చినట్లు ప్రేక్షకులు చెప్పారు. కొందరికి వాంతులు అయినట్లు తెలిపారు. పోలీసులు వచ్చి తనిఖీ చేసిన తర్వాత 20 నిమిషాలకు తిరిగి షో మొదలుపెట్టారు.
‘పుష్ప ది రూల్’ ప్రీమియర్‌లో భాగంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో థియేటర్‌కు వచ్చిన హీరో అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈక్రమంలో వారిని కంటోల్ర్ చేసేందుకు పోలీసులు చేయడంతో రేవతి(35)తో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ(9) కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఇద్దరూ గాయాలతో స్పృహ తప్పారు. పోలీసులు వారికి సీపీఆర్ చేసి స్థానికి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రేవతి మృతి