Sai Durgha Tej: సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన హీరో సాయి దుర్గ తేజ్‌.. విషయమిదే!

ABN , Publish Date - Jul 14 , 2024 | 08:35 PM

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌ రెడ్డితో, మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్‌ ఈ రోజు (ఆదివారం) సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మర్యాద పూర్వకంగా ఆయనని కలిశారు. ఈ మీటింగ్‌లో మంత్రి కొండా సురేఖతో పాటు కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేత రోహిన్‌ రెడ్డి వున్నారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కూడా ఆయన కలిశారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy)తో, మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్‌ (Sai Durgha Tej) ఈ రోజు (ఆదివారం) సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మర్యాద పూర్వకంగా ఆయనని కలిశారు. ఈ మీటింగ్‌లో మంత్రి కొండా సురేఖతో పాటు కాంగ్రెస్‌ ఎంపీ చామాల కిరణ్‌కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేత రోహిన్‌ రెడ్డి వున్నారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka)ను కూడా ఆయన కలిశారు. ఈ భేటీ వెనుక ఉన్న విషయమేమిటంటే..

సాయి దుర్గా తేజ్ మొదటి నుంచి సామాజిక స్పృహా వున్న హీరోల్లో ముందు వరుసలో వుంటూ వస్తున్నారు. ఇటీవల ‘సత్య’ అనే సామాజిక సందేశం వున్న సినిమాతో దేశ సైనికుల త్యాగాలు, వారి కుటుంబ త్యాగాలు అందరికి తెలిసేలా చేసిన సాయి దుర్గా తేజ్‌.. ప్రభుత్వం తరపున చేపట్టే రోడ్డు ప్రమాదాల నివారణ అవగాహన కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవారు. తాజాగా తండ్రి, కూతురి మధ్య వున్న అనుబంధానికి మచ్చ తెచ్చేలా యూట్యూబ్‌లో ఓ వీడియోను కామెంట్‌ చేసిన వ్యవహారంలో యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతు నీచ బుద్దిని సాయి దుర్గ తేజ్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వం దృష్టికి తెచ్చిన సంగతి తెలిసిందే. (Sai Durgha Tej Meets CM Revanth Reddy)


Bhatti.jpg

కుటుంబ విలువలకు మచ్చ తేచ్చేలా ఫన్‌ పేరుతో చిన్న పిల్లలను ట్రోల్‌ చేస్తున్న, ప్రణీత్‌ హనుమంతు వంటి వారిని కఠినంగా శిక్షించాలని ట్వీట్ చేశారు సాయి దుర్గ తేజ్. దీనికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించగా, ప్రణీత్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ ప్రభుత్వం సకాలంలో తన ట్వీట్‌కు స్పందించిన తీరుకు కృతజ్ఞతగా సాయి దుర్గ తేజ్‌ ఈ రోజు ముఖ్యమంత్రిని కలిసి తన అభినందనలు తెలియజేశారు. అంతేకాదు, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మిషన్‌లో తను ఎంత వరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సాయి దుర్గ తేజ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Sai Durgha Tej Meets Deputy CM Bhatti Vikramarka)

Updated Date - Jul 14 , 2024 | 08:35 PM