Varalaxmi Sarathkumar Wedding: వరలక్ష్మిశరత్‌కుమార్ పెళ్లి ఖర్చు అన్ని కోట్లా? నిజమేనా
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:24 PM
వరలక్ష్మి శరత్‌కుమార్ ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ వివాహానికి అయిన ఖర్చు గురించి వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.
విలక్షణ నటి టాలీవడ్ ఆగ్ర నటి వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి జరిగి వారం కావస్తున్న ఆ వేడుకపై సోషల్ మీడియాలో ఏదో ఒక అంశం ట్రెండింగ్‌లో ఉంటూ వస్తోంది. తాజాగా ఆ వివాహానికి అయిన ఖర్చు, తన ప్రియుడు నికోలయ్ సచ్దేవ్ (Nicholai Sachdev) ఆస్తుల గురించి వార్తలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
జూలై2 థాయిలాండ్ దేశంలో వరలక్ష్మి, నికోలయ్ వివాహం అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరుగగా, చైన్నైలోని ఓ పైవ్ స్టార్ హోటల్లో రిసెప్షన్ నిర్వహించారు. అయితే నికోలయ్ (Nicholai Sachdev) పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతుడని, ముంబైలో పెద్ద ఎత్తున బిజినెస్ల్ ఉండగా.. అతని నిఖర ఆస్థుల విలువ రూ.వెయ్యి కోట్ల వరకు ఉండోచ్చనే వార్తలు ఉన్నాయి. ఈక్రమంలోనే పెళ్లి సందర్భంగా నికోలయ్ బంగారం, వజ్రాలతో చేసిన చాలా విలువైన వస్తువులను, ఇతర బహుమతులను పెద్ద ఎత్తున వరలక్ష్మికి అంద జేసినట్లు సోషల్ మీడియాలో న్యూస్ బాగా చక్కర్లు కొడుతుంది.
అంతేకాకుండా రిసెప్షన్ సందర్భంగా దేశం నలుమూలల నుంచి చాలామంది అతిరథ మహరథులు హజరైన క్రమంలో ఆ వేడుకకు శరత్ కుమార్ (Sarathkumar) రూ. 200 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్టుగా కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై శరత్ కుమార్ మాట్లాడుతూ.. వరలక్ష్మి (Varalaxmi) వివాహం మాకున్న స్థాయిలోనే, అందరిలాగే చేశామని.. ఖర్చు విషయంలో మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలు పూర్తిగా అబద్దమని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ కావాలనే కొంతమంది ఏదో ఏదో ఊహించుకుని, తమ రేటింగ్స్, వ్యూస్ కోసం థంబ్ నెయిల్స్ పెట్టి తమకు ఇష్ట మొచ్చిన విధంగా వార్తలు అల్లేస్తున్నారిని అన్నారు. పెళ్లికి అంతా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని, ఒకవేళ నా వద్ద అంత డబ్బే ఉంటే సినిమాలు చేయాల్సిన అవసరమేంటి అన్న వరీతిలో మాట్లాడారు. దయచేసి తప్పుడు వార్తలను నమ్మోద్దని శరత్ కుమార్ (Sarathkumar) హితవు పలికారు.
ఇదిలాఉండగా వరలక్ష్మి (Varalaxmi) పెళ్లి చేసుకున్న నికోలయ్ సచిదేవ్ (Nicholai Sachdev) ముంబైలో ఆర్ట్ గ్యాలరీ బిజినెస్‌ను నడుపుతుండగా ఆయనకు గతంలోనే మోడల్ కవితతోపెళ్లి జరిగింది. 15 సంవత్సరాల కూతురు కాషా కూడా ఉండగా తను ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ ఛాంఫియన్షిప్లలో పాల్గొంటోంది. తాజాగా సచ్దేవ్ ఇప్పుడు వరలక్ష్మిని రెండో వివాహం చేసుకోవడం విశేషం.