Shankar Dada Mbbs: వినోదం.. భావోద్వేగం.. సందేశం కలగలిపిన డాక్టర్‌దాదా

ABN , Publish Date - Oct 15 , 2024 | 04:05 PM

అరే ఏటీఎమ్‌ రెండురెళ్లు ఎంతరా.. ఐదన్నా.. మా లెక్కంతే.. ఎస్‌ మిస్టర్‌ లింగం.. వెంకీస్‌ మ్యారేజ్‌.. సుబ్సీస్‌ డెత్‌ యానివర్సరీ.. డైలాగ్‌లతో వినోదాన్ని పంచారు

అరే ఏటీఎమ్‌ రెండురెళ్లు ఎంతరా.. ఐదన్నా.. మా లెక్కంతే.. (Shankar dada Mbbs)


ఎస్‌ మిస్టర్‌ లింగం.. వెంకీస్‌ మ్యారేజ్‌.. సుబ్సీస్‌ డెత్‌ యానివర్సరీ.. డైలాగ్‌లతో వినోదాన్ని పంచారు

'చాలు బిడ్డ చాలు.. ఇన్నేళ్ల సంది నా సర్వీస్‌లో ఇంత ప్రేమగా మాట్లాడిన వారు లేరు..’


'రోగిని ప్రేమించలేని డాక్టర్‌ కూడా రోగితో సమానం'.. అంటూ భావోద్వేగాన్ని కలిగించారు


జంతర్‌మంతర్‌ జూమంతర్‌ అంటూ ప్రేమను పంచారు శంకర్‌ దాదా.

Shankar-audio-.jpg

చిరంజీవి (Chiranjeevi) హీరోగా జయంత్‌ సి.పరాన్జీ 9jayanth c Paranji) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’. హిందీలో బ్లాక్‌బస్టర్‌ హిట్టైన 'మున్నభాయ్‌ ఎంబీబీఎస్‌’ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్‌ 15 2004లో విడుదలైంది. నేటికి సరిగ్గా ఈ చిత్రం విడుదలై 20 ఏళ్లు పూర్తయింది. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో  సోనాలి బింద్రే (Sonali bindre) కథానాయికగా నటించింది. శ్రీకాంత్‌, పరేష్‌ రావల్‌, గిరీష్‌ కర్నాడ్‌ కీలక పాత్రలు పోషించారు. వినోదం, భావోద్వేగం, చక్కని సందేశంతో రూపొందిన ఈ చిత్రం ఇంద్ర, ఠాగూర్‌ వంటి భారీ విజయాల తర్వాత వచ్చిన ఈ చిత్రం అదే స్థాయిలో విజయం అందుకుంది. చిరంజీవి మార్క్‌ కామెడీ యాక్షన్‌తో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించింది. ఈ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ సినిమా ప్రత్యేకతలను గుర్తు చేసుకుందాం.

Snakar-bbs.jpg

చిరంజీవి కెరీర్‌లో 'ఇంద్ర', 'ఠాగూర్‌'లాంటి భారీ విజయాల తర్వాత వచ్చిన 'అంజి' కాస్త నిరూత్సాహపరిచింది. తదుపరి  వచ్చిన 'శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ రెట్టింపు విజయం అందుకుని అభిమానుల్లో నూతన ఉత్సాహం అందించింది. కామెడీ ప్రధానంగా సాగిన ఈ చిత్రంలోని వినోదం, పాటలు, ఫైట్లు సమపాళ్లల్లో కుదిరాయి. శంకర్‌ ప్రసాద్‌గా చిరంజీవి, సునీతగా సోనాలి బింద్రే, ఏటీఎమ్‌గా శ్రీకాంత్‌ పాత్రలు ఆకట్టుకున్నాయి. జెమినీ ఫిల్మ్‌ సర్య్కూట్‌ సంస్థ భారీతనంతో నిర్మించింది.

Dada.jpg

ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకుంటున్న తరుణంలో 'సందే పొద్దు లత్తాంటే.. దీని దిమ్మతీయ’ పాటను జోడించారు. చిరంజీవి, సోనాలి బిండ్రేపై చిత్రీకరించిన ఈ పాట బయ్యర్లకు ఎక్సట్రా బోనస్‌ను,  ప్రేక్షకులకు ఎక్ర్స్టా వినోదాన్ని అందించింది. ఇదే చిత్రాన్ని తమిళంలో కమల్‌హాసన్‌ హీరోగా 'వసూల్‌ రాజా’ పేరుతో, కన్నడంలో ఉపేంద్ర హీరోగా 'ఉప్పి దాదా ఎంబీబీఎస్‌’ పేరుతో రీమేక్‌ చేశారు నిర్మాత రవిశంకర్‌ ప్రసాద్‌. ఆ రెండు చిత్రాల కంటే 'శంకర్‌ దాదా ఎంబీబీస్‌ ఎక్కువ వసూళ్లు రాబట్టింది.



పవన్‌ స్పెషల్‌ ఎంట్రీ..
ఈ చిత్రంలో అన్ని పాటలు సూపర్‌హిట్టే. అయినప్పటికీ ఇందులో ఓ పాటకు మరింత ప్రత్యేకత ఉంది. చిరంజీవి, ముంబై బోల్డ్‌ బ్యూటీ గౌహర్‌ఖాన్‌లపై తెరకెక్కించిన 'నా పేరే కాంచర మాల’ ఓ ఊపు ఊపింది. మాస్‌ మసాల సాంగ్‌గా తీర్చిదిద్దిన ఈ పాటలో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్  గెస్ట్‌ అపీయరెన్స్‌ ఇవ్వడంతో ఓ క్షణం తెరపై కనిపించడంతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. అప్పట్లో ఇదొక ట్రెండ్‌గా చెప్పుకున్నారు. అంతే కాదు ఇందులో 'పట్టుపట్డు చెయ్యే పాటు' సాంగ్‌ షూటింగ్‌ సమయంలో కథానాయిక సోనాలి బింద్రే మూడు నెలల కడుపుతో ఉన్నారని అయినా సరే కష్టపడి పాటను పూర్తి చేశారని చెప్పేవారు. ఇటీవల ఈ చిత్రాన్ని 4కె వెర్షన్‌కు కన్వర్ట్‌ చేసి రీ రిలీజ్‌ చేశారు. అప్పుడు కూడా ఈ చిత్రం వసూళ్లతో సత్తా చాటింది.

Dsp.jpg

చిరు కోసం దేవిశ్రీ ప్రసాద్‌ తొలిసారి..
చిరంజీవికి చిన్ననాటి నుంచే వీరాభిమాని అయిన దేవిశ్రీ ప్రసాద్‌ తొలిసారి చిరంజీవి సినిమాకు సంగీతం అందించే అవకాశం అందుకున్నారు. టైటిల్‌ సాంగ్‌కు నుంచి ప్రత్యేక గీతం వరకూ తన మార్క్‌ చూపించారు రాక్‌స్టార్‌ డిఎస్‌పి. పాటలన్నీ చార్ట్‌బస్టర్‌ హిట్‌ అయ్యాయి. అంతే కాదు నేపథ్య సంగీతం కూడా అంతే స్థాయిలో అందించారు దేవి. 

Updated Date - Oct 15 , 2024 | 04:13 PM