Anasuya Bharadwaj: అనసూయ తాజా ఫోటోలపై నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jun 28 , 2024 | 04:46 PM

అనసూయ మళ్ళీ తన తాజా ఫోటోలను పోస్టు చేసింది. ఈసారి బ్లూ అవుట్ ఫిట్ లో అందంగా వున్న ఫోటోలను పెడుతూ, సర్కార్ నాలుగో సీజన్ కి రెడీ అవుతున్నాను అని చెప్పింది. అయితే ఈ ఫోటోలపై నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

Anasuya Bharadwaj: అనసూయ తాజా ఫోటోలపై నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్
Anasuya Bharadwaj

అనసూయ ఎప్పటికప్పుడు తన తాజా ఫోటోలను తన సామాజిక మాధ్యమంలో పెడుతూ అభిమానులని అలరిస్తూ ఉంటుంది. ఒక బ్లూ అవుట్ ఫిట్ లో అనసూయ చక్కటి ఫోటోలను ఇప్పుడు తాజాగా పోస్ట్ చేసింది. సర్కార్ సీజన్ 4 కోసం సమాయత్తం అవుతున్నాను అని చెపుతూ అందుకోసమని తయారయినట్టుగా ఫోటోలను పెట్టింది. ఫోటోలపై నెటిజన్స్ తమ కామెంట్స్ పెడుతూ వున్నారు. అనసూయ ఎంతో అందంగా ఉందని, అలాగే ఎప్పుడూ ఉండాలని కొందరు నెటిజన్స్ కామెంట్స్ పెట్టారు. (Anausya is gearing up for the Show Sarkaar Season four)

anasuyalatest.jpg

అలాగే నెటిజన్స్ ఎంతోమంది ఆమె ఫోటోలకి ఫిదా అయిపోయారు. అందులో ఒక నెటిజెన్ అయితే ఏకంగా ఒక షాకింగ్ కామెంట్ పెట్టారు. ఇంతకీ ఆ నెటిజన్స్ చేసిన కామెంట్ ఏంటంటే, 'లవ్ దోజ్ తైస్' అని పెట్టారు. మరికొందరు నెటిజన్స్ ఈ ఫోటోలు చాలా బాగున్నాయి అని చెప్పారు. 'మీరు ఎప్పుడూ ఇలాగె రెడీ అవ్వండి' అని ఇంకో నెటిజెన్ కామెంట్ చేశారు.

anasuyalatestc.jpg

ప్రస్తుతం అనసూయ 'పుష్ప 2' చిత్రీకరణలో బిజీగా వుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కథానాయకుడు, రష్మిక మందన్న కథానాయిక. ఇది 'పుష్ప' సినిమాకి సీక్వల్ గా వస్తోంది. ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదలవుతుంది.

anasuyalatesta.jpg

ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమా ఆగస్టు 15న విడుదలవ్వాల్సింది, కానీ విడుదల తేదీని వాయిదా వేశారు. చిత్రీకరణ ఇంకా చాలా భాగం ఉందని, దానికితోడు గ్రాఫిక్స్ పని కూడా మిగిలివుందని, అందుకని వాయిదా వెయ్యటమే మంచిదని డిసెంబర్ నెలకి వాయిదా వేశారు.

anasuyalatestb.jpg

సర్కార్ రియాలిటీ షో ఆహా ఓటిటి ప్లాటుఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సర్కార్ షోకి సుడిగాలి సుధీర్ వ్యాఖ్యాతగా వున్నాడు. అలాగే స్టార్ మా లో కూడా అనసూయ ఒక షో కి వ్యాఖ్యాతగా చేస్తోంది. అటు సినిమాలు, ఇటు బుల్లితెరపై అనసూయ తనదైన మార్కుతో బిజీగా ఉంటోంది. అనసూయ పెట్టిన తాజా ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Updated Date - Jun 28 , 2024 | 05:01 PM