Sonali Bendre: ‘దాయి దాయి దామ్మా’ పాటలో వీణ స్టెప్‌ వేయమంటారేమో అని భయపడ్డా..

ABN , Publish Date - Aug 21 , 2024 | 10:57 PM

‘ఇంద్ర’ సినిమాలోని ‘దాయి దాయి దామ్మా’ పాటలో తనని కూడా వీణ స్టెప్‌ వేయమంటారేమో అని భయపడిపోయానని అన్నారు ఈ చిత్ర హీరోయిన్, ఆ పాటలో నర్తించిన నర్తకి సోనాలి బింద్రే’. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన ‘ఇంద్ర’ సినిమాను ఆగస్ట్ 22న 385కు పైగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాతో తనుకున్న అనుభవాలను సోనాలి షేర్ చేసుకున్నారు.

Sonali Bendre About Indra Re Release

‘ఇంద్ర’ (Indra Movie) సినిమాలోని ‘దాయి దాయి దామ్మా’ పాటలో తనని కూడా వీణ స్టెప్‌ వేయమంటారేమో అని భయపడిపోయానని అన్నారు ఈ చిత్ర హీరోయిన్, ఆ పాటలో నర్తించిన నర్తకి సోనాలి బింద్రే (Sonali Bendre). మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన ‘ఇంద్ర’ సినిమాను ఆగస్ట్ 22న 385కు పైగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో సోనాలి బింద్రే, ఆర్తీ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం రీ రిలీజ్ సందర్భంగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన సంతోషాన్ని వ్యక్తం చేయగా.. తాజాగా ఇందులో హీరోయిన్‌గా నటించిన సోనాలి బింద్రే ఓ వీడియో ద్వారా ఈ సినిమా టైమ్‌లోని తన అనుభవాలను షేర్ చేసుకున్నారు. (Happy Birthday Megastar Chiranjeevi)

Also Read- Megastar Chiranjeevi: ఓ రేంజ్‌లో మొదలైన మెగాస్టార్ బర్త్‌డే సెలబ్రేషన్స్


ఆమె మాట్లాడుతూ.. ‘‘నిర్మాత అశ్వినీదత్‌గారి వైజయంతీ బ్యానర్‌లో నటించడం ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి. ఆయన చాలా మంచి వ్యక్తి. అలాగే చిరంజీవిగారితో కలిసి నటించడం, డ్యాన్స్ చేయడం ఎప్పటికీ మరిచిపోలేను. ‘ఇంద్ర’ సినిమాలో నాకు అన్నింటికంటే కష్టంగా అనిపించింది ఆయనతో డ్యాన్స్ చేయడమే. ముఖ్యంగా ‘దాయి దాయి దామ్మా’ పాట చిత్రీకరణ మరుసటి రోజే అని తెలిసి.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు. ఎలా డ్యాన్స్ చేయాలా అనే ఆలోచిస్తూ ఉన్నాను. చిరంజీవిగారు వీణ స్టెప్‌ని అద్భుతంగా చేశారు. ఆ స్టెప్‌ని ఆయనతో పాటు నన్ను కూడా చేయమంటారేమో అని చాలా భయపడిపోయాను. (Sonali Bendre About Indra Movie)


Chiru-indra.jpg

అలాగే అందులోని ‘రాధే గోవిందా’ పాట కూడా చాలా అద్భుతంగా షూట్ చేశారు. ఆ పాటని హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరించారు. ఆ పాట చిత్రీకరణ సమయంలో చిరంజీవిగారి ఫ్యామిలీ సభ్యులందరూ ఆ సెట్‌కి వచ్చేశారు. చాలా సరదాగా ఉండేది. ఇప్పుడీ సినిమాను చిరంజీవిగారి బర్త్‌డే రోజున రీ రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బిగ్ స్క్రీన్‌పై మరోసారి ‘ఇంద్ర’ సినిమాను చూసేందుకు వెయిట్ చేస్తున్నాను. నిజంగా ఇది చిరంజీవి అభిమానులకు పండగ రోజే..’’ అని సోనాలి బింద్రే ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. ఇప్పుడీ వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. (Indra 4K Re Release)

Read Latest Cinema News

Updated Date - Aug 21 , 2024 | 10:57 PM