Suriya: టాలీవుడ్‌ హీరోలపై సూర్య కామెంట్స్‌

ABN , Publish Date - Oct 28 , 2024 | 11:24 AM

నాకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు సోషల్‌ మీడియా వేదికగా చాలామంది విష్‌ చేశారు. కానీ చిరంజీవి  ప్రత్యేకంగా ఫోన్‌ చేసి అభినందించారు. చెన్నైలో ఎన్జీవో ప్రారంభించడానికి ఆయనే నాకు స్ఫూర్తి.

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలపై కోలీవుడ్‌ స్టార్‌ సూర్య (Suriya) ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన 'కంగువా' (Kanguva) చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం వైజాగ్‌లో (Vizag Event) ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో సూర్య, బాబీ దేవోల్‌, దేవిశ్రీ ప్రసాద్ పాల్గొని సందడి చేశారు. అభిమానులతో ముచ్చటించారు. ఆ ఈవెంట్‌లో తెలుగు హీరోలతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. హీరోల గురించి ఆయన ఏమన్నారంటే... 

చిరంజీవి(Chiranjeevi):
నాకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు సోషల్‌ మీడియా వేదికగా చాలామంది విష్‌ చేశారు. కానీ చిరంజీవి  ప్రత్యేకంగా ఫోన్‌ చేసి అభినందించారు. చెన్నైలో ఎన్జీవో ప్రారంభించడానికి ఆయనే నాకు స్ఫూర్తి.

పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan):
రీల్‌ లైఫ్‌లో అయినా.. రియల్‌ లైఫ్‌లోనైనా ఒకేలా ఉంటారు. మంచి మనసున్న వ్యక్తి

ప్రభాస్‌: ప్రభాస్‌తో మల్టీస్టారర్‌ చేేస్త ఫుల్‌ యాక్షన్‌ మూవీ చేస్తాను. ప్రభాస్‌ డార్లింగ్‌.. కటౌట్‌ చూసి కొన్నికొన్ని నమ్మేయ్యాలి.
 
రామ్‌ చరణ్‌: చరణ్‌ నాకు సోదరుడితో సమానం. ఆయనతో నాకు చాలా మెమొరీస్‌ ఉన్నాయి. నా సినిమాలు చూసి ఫోన్‌ చేసి ప్రశంసిస్తారు. వాళ్ల కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయనతో కలిసి స్క్రీన్  షేర్‌ చేసుకోవాలనుంది.

మహేశ్‌ బాబు(Mahesh Babu):
స్కూల్లో మహేశ్‌ నాకు జూనియర్‌. ఆయన స్క్రీన్  ప్రెజెన్స్‌ బాగుంటుంది. ఎమోషన్స్‌ బాగా చూపిస్తారు.

ఎన్టీఆర్‌: ఎన్టీఆర్‌ తెలుగు మాట్లాడే విధానం ఆకట్టుకుంటుంది. చాలా స్పష్టంగా మాట్లాడుతారు. ఆయనలో ఆ క్వాలిటీ నాకెంతో ఇష్టం.

అల్లు అర్జున్‌:
నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి అల్లు అరవింద్‌ కూడా ఓ కారణం. ‘గజిని’ సినిమాను ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు . అల్లు అర్జున్‌ చాలా కష్టపడతారు. డ్యాన్స్‌ బాగా చేస్తారు. ‘పుష్ప2’ కోసం వేచి చూస్తున్నా.

Srikanth Iyengar: క్షమాపణ చెబుతా.. వేచి ఉండండి


కంగువా చిత్రం శివ దర్శకత్వంలో తెరకెక్కింది. ఫాంటసీ యాక్షన్‌  ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమా రెండు భాగాల్లో విడుదల కానుంది. మొదటి పార్ట్‌ నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకొస్తుంది. దిశాపటానీ కథానాయిక. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. పది భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకురానున్నారు. పలు అంతర్జాతీయ భాషల్లోనూ సినిమాని విడుదల చేేసందుకు సన్నాహాలు చేస్తున్నారు.

READ ALSO: Nayanthara: అలాంటి ప్రయత్నం చేయలేదు.. ఆ అవసరం లేదు


Updated Date - Oct 28 , 2024 | 01:31 PM