August 15 releases: ఆ రెండు సినిమాలకి అనుకున్నంత బజ్ రాలేదు

ABN , Publish Date - Jul 31 , 2024 | 02:16 PM

ఈ ఆగస్టు 15న నాడు రెండు తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ రెండు తెలుగు సినిమాల విజయంపై ఇద్దరి దర్శకుల భవితవ్యం ఆధారపడి వుంది. 2019లో వచ్చిన 'గద్దలకొండ గణేష్' తరువాత ఇప్పుడు 'మిస్టర్ బచ్చన్' సినిమాతో వస్తున్న హరీష్ శంకర్, అలాగే 'లైగర్' డిజాస్టర్ అయిన రెండు సంవత్సరాల తరువాత దర్శకుడు పూరి జగన్ 'డబుల్ ఇస్మార్ట్' తో వస్తున్నారు.

Stills from Mr Bachchan and Double Ismart

ఈ ఆగస్టు 15వ తేదీన రెండు తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. ఒకటి హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో వస్తున్న 'మిస్టర్ బచ్చన్', రెండో సినిమా పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో వస్తున్న 'డబుల్ ఇస్మార్ట్'. ఈ రెండు సినిమాలు ప్రచారాలు మొదలెట్టాయి, కొన్ని పాటలు, టీజర్ లాంటివి విడుదల చేశాయి. ఇందులో 'మిస్టర్ బచ్చన్' సినిమా అజయ్ దేవగన్ నటించిన హిందీ సినిమా 'రైడ్' అనే సినిమాకి అనువాదం సినిమాగా తీశారు. (Latest update on Puri Jagannath and Ram Pothineni combination film 'Double iSmart'

mrbachchanraviteja.jpg

'డబుల్ ఇస్మార్ట్' సినిమా ఇంతకు ముందు తీసిన 'ఇస్మార్ట్ శంకర్' అనే సినిమాకి సీక్వల్ గా వస్తోంది. పూరి జగన్, ఛార్మి ఈ సినిమాకి నిర్మాతలు, ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. పూరి జగన్ ఇంతకు ముందు 'లైగర్' అనే సినిమా విజయ్ దేవరకొండ కథానాయకుడిగా చేశారు, కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు చాలా విరామం తరువాత అంటే సుమారు రెండేళ్ల తరువాత 'డబుల్ ఇస్మార్ట్' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. (Latest update on Harish Shankar and Ravi Teja combination 'Mr Bachchan' film).

కానీ ఈ రెండు సినిమాలకి ఎక్కడా బజ్ కనిపించటం లేదు అని అంటున్నారు. హరీష్ శంకర్ చేస్తున్న బచ్చన్ టీజర్ కొన్ని రోజుల క్రితం విడుదలైంది, అయితే అది మరీ కామెడీగా కనిపిస్తోంది అని అంటున్నారు. దర్శకుడు ఆ టీజర్ లో సినిమా గురించి సరిగ్గా చెప్పలేకపోయారని అంటున్నారు. ఎందుకంటే 'రైడ్' సినిమా ఓటిటిలో వుంది, చాలామంది చూశారు కూడా. అలాగే అజయ్ దేవగన్ ఒక ఇన్ కమ్ టాక్స్ అధికారిగా ఆ పాత్రలో మమేకం అయిపోయి నటించారు, చాలా సీరియస్ గా వుండే పాత్ర అతనిది. అటువంటి సినిమాని హరీష్ శంకర్ మరీ కామెడీ చేశారేమో అని కొందరు అంటున్నారు.

doubleismartteaserone.jpg

ఎందుకంటే ఈమధ్య విడుదలైన టీజర్ లో ఎటువంటి కొత్తదనం కనిపించలేదని అంటున్నారు. అందుకని ఈ సినిమాకి అంతగా బజ్ రాలేదు. ఇక పూరి జగన్, రామ్ పోతినేని సినిమా పరిస్థితి కూడా అలానే వుంది అంటున్నారు. ఎందుకంటే పూరి జగన్ ఇంతకు ముందు చేసిన 'లైగర్' వలన చాలామంది డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారని పరిశ్రమలో చర్చ నడుస్తోంది. ఆ సినిమా విడుదలయ్యాక డిస్ట్రిబ్యూటర్లు, పూరి జగన్ మధ్య కొంత వివాదాలు నడిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పూరి జగన్ మళ్ళీ ఈ సినిమాతో వస్తూ ఉండటం, ఈ సినిమా ప్రచార చిత్రాలు కూడా అంత ఆసక్తికరంగా లేకపోవటంతో ఈ సినిమాకి కూడా అనుకున్నంత బజ్ మాత్రం లేదని అంటున్నారు. అయితే ఇంకా 15 రోజులు సమయం వుంది, ఈలోపు రెండు సినిమాల నిర్వాహకులు ఈ సినిమా ప్రచారాలు వేగవంతం చేస్తారని అనుకుంటున్నారు.

ఈమధ్య ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కి ఎక్కువ రావటం లేదు. ఒక్క పెద్ద స్టార్ సినిమా విడుదలైనప్పుడు మాత్రం వస్తున్నారు, అంతే, ఆ తరువాత మళ్ళీ రావటం లేదు. ఇటువంటి సమయంలో సినిమాలో విషయం వుండి, ప్రచారాలు బాగా ఉంటేనే ప్రేక్షకులు కొంచెం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రెండు సినిమాల పరిస్థితి ఎలా ఉండబోతోందో ఈ ఆగస్టు 15న తెలిసిపోతుంది.

Updated Date - Jul 31 , 2024 | 02:17 PM