68th Filmfare Awards South 2023: ఫిలింఫేర్ అవార్డులు.. ఏ భాషలో ఎవరెవరికి వచ్చాయంటే!
ABN , Publish Date - Jul 12 , 2024 | 09:36 AM
2023 సంవత్సరానికి సౌత్ ఫిలింఫేర్ అవార్డులను తాజాగా ప్రకటించారు. తెలుగులో రామ్ చరణ్ , ఎన్టీఆర్, మృణాల్ ఠాకూర్, తమిళంలో కమల్ హసన్, సాయి పల్లవి, కన్నడలో రిషబ్ షెట్టి, చైత్ర అచార్, మలయాళంలో కుంచకోబోబన్, దర్షణ ఉత్తమ నటీనటులుగా అవార్డులు దక్కించుకున్నారు.
2023 సంవత్సరానికి సౌత్ ఫిలింఫేర్ అవార్డులను ప్రకటించారు. వీటిలో RRR , సీతారామం చిత్రాలు సత్తా చాటి ఎక్కువ అవార్డులను దక్కించుకున్నాయి. విరాట పర్వం రెండు అవార్డులను కైవసం చేసుకుంది. ముఖ్యంగా సాయి పల్లవి తమిళంలో ఉత్తమ నటిగా, తెలుగులో క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా రెండు భాషల్లో అవార్డులు దక్కించుకోవడం విశేషం.
అంతేగాక సౌత్ ఇండియాలో తక్కువ కాలంలో ఆరు సార్లు ఫిలింఫేర్ అవార్డు దక్కించుకున్న కథానాయికగా రికార్డు సృష్టించింది. ఇంతకు ముందు నాలుగు సార్లు, ఇప్పుడు రెండు అవార్డులతో కలుపుకుని మొత్తంగా 6 అవార్డులు రాగా ఇందులో 4 అవార్డులు తెలుగు చిత్రాలకే రావడం గమనార్హం. రామ్ చరణ్ కు 4వ సారి అవార్డు దక్కింది.
ఇప్పటికే 17 ఫిలింఫేర్ అవార్డులతో దేశంలోనే టాప్ ప్లేస్‌లో ఉన్న కమల్ హసన్ ఖాతాలో 18వ సారి అవార్డు వచ్చి చేరింది. అదేవిధంగా తమిళంలో ధనుష్ నటించిన తిరు సినిమా అధికంగా అవార్డులు గెలుచుకోవడం విశేషం. ఇంకా ఇతర భాషలలో ఎవరెవరికీ అవార్డులు వచ్చాయంటే.
తెలుగులో
ఉత్తమ చిత్రం RRR
ఉత్తమ దర్శకుడు రాజమౌళి RRR
ఉత్తమ నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ (RRR)
ఉత్తమ నటి మృణాల్ ఠాకూర్ (సీతారామం)
ఉత్తమ సంగీత దర్శుడు కీరవాణి (RRR)
ఉత్తమ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి (సీతారామం)
ఉత్తమ గాయకుడు కాల భైరవ (RRR కొమరం భీముడో)
ఉత్తమ గాయని (ఫిమేల్) చిన్మయి శ్రీపాద (సీతారామం)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) సీతారామం
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) దుల్కర్ సల్మాన్ (సీతారామం)
ఉత్తమ నటి (క్రిటిక్స్) సాయి పల్లవి ( విరాట పర్వం)
ఉత్తమ సహాయ నటుడు రానా (భీమ్లా నాయక్)
ఉత్తమ సహాయ నటి నందితా దాస్ (విరాట పర్వం)
ఉత్తమ సినిమాటోగ్రఫీ సెంథిల్, రవి వర్మన్
ఉత్తమ ప్రోడక్షన్ డిజౌన్ సాబు సిరిల్ (RRR)
ఉత్తమ నృత్య దర్శుడు ప్రేమ్ రక్షిత్ (RRR)
తమిళంలో
ఉత్తమ చిత్రం పొన్నియన్ సెల్వన్ 1
ఉత్తమ నటుడు కమల్ హసన్ (విక్రమ్)
ఉత్తమ నటి సాయి పల్లవి (గార్గి)
ఉత్తమ దర్శకుడు మణి రత్నం (పొన్నియన్ సెల్వన్ 1)
ఉత్తమ సంగీత దర్శకుడు రెహమాన్ (పొన్నియన్ సెల్వన్ 1)
ఉత్తమ సహాయ నటుడు (మేల్) కాళి వెంకట్
ఉత్తమ సహాయ నటి ఊర్వశి
ఉత్తమ చిత్రం క్రిటిక్స్ కదైసి వ్యవసాయి
ఉత్తమ యాక్టర్ క్రిటిక్స్ ధనుష్ (తిరు), మాధవన్(రాకెట్రీ)
ఉత్తమ నటి క్రిటిక్స్ నిత్యా మీనన్ (తిరు)
ఉత్తమ గేయ రచయిత తమిరై
ఉత్తమ గాయకుడు సంతోష్ నారాయణ్ (తిరు)
ఉత్తమ గాయని అంతనా నంది
ఉత్తమ తొలి చిత్ర నటుడు ప్రదీప్ రంగనాథ్
ఉత్తమ తొలి చిత్ర నటి అదితి శంకర్ (విరుమన్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ సెంథిల్, రవి వర్మన్
Kannada
ఉత్తమ చిత్రం కాంతార
ఉత్తమ నటుడు రిషబ్ షెట్టి (కాంతార)
ఉత్తమ నటి చైత్ర జే అచార్
ఉత్తమ దర్శకుడు కిరణ్ రాజ్ 777 ఛార్లీ
ఉత్తమ సహాయ నటుడు అచ్యుత్ కుమార్
ఉత్తమ సపోర్టింగ్ నటి మంగళ
ఉత్తమ సంగీత దర్శుడు అజనీష్
ఉత్తమ గేయ రచయిత నాగేంద్ర ప్రసాద్
ఉత్తమ గాయకుడు (మేల్) సాయి విగ్నేశ్
ఉత్తమ గాయని (ఫిమేల్) సునిధి చౌహాన్
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) ధరణి మండల
ఉత్తమ నటుడు క్రిటిక్స్ నవీన్ శంకర్
ఉత్తమ నటి క్రిటిక్స్ (ఫిమేల్) సప్తమి గౌడ
మలయాళం (Malayalam)
ఉత్తమ చిత్రం (నా థన్ కేస్ కోడు)
ఉత్తమ నటుడు కుంచకో బోబన్ ( నా థన్ కేస్ కోడు)
ఉత్తమ నటి దర్షన రాజేంద్రన్ (జయజయజయజయహే)
ఉత్తమ దర్శకుడు రతీస్ బాలకృష్ణన్ (నా థన్ కేస్ కోడు)
ఉత్తమ సహాయ నటుడు (మేల్) ఇంద్రాన్స్ (ఉడల్)
ఉత్తమ సహాయ నటి (ఫిమేల్) పార్వతి తిరువోతు (ఫుజు)
ఉత్తమ సంగీత దర్శకుడు కైలాష్ మీనన్ (వాషి)
ఉత్తమ గేయ రచయిత అరుణ్ అలత్ (హృదయం)
ఉత్తమ ప్లేబాక్ సింగర్ (మేల్) ఉన్ని మీనన్ (భీష్మ పర్వం)
ఉత్తమ ప్లేబాక్ సింగర్ (ఫిమేల్) మృధుల వారియర్ (పాథోన్పథం నోట్టండు)
ఉత్తమ ఫిలిం (క్రిటిక్స్) అరిఇప్పు
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) అలెన్సియర్ లే లోపెజ్ (అప్పన్)
ఉత్తమ నటి (క్రిటిక్స్) రేవతి (భూతకాలం)