Tollywood Updates: దసరా పర్వదినం.. కొత్త అప్‌డేట్స్‌ ఏంటో తెలుసా..

ABN , Publish Date - Oct 12 , 2024 | 02:25 PM

టాలీవుడ్‌కు (Tollywood) పండుగ (Dasara Festival) సెంటిమెంట్‌ బాగా ఎక్కువ. అందులోనూ దసరా పండుగా అనగానే అత్యంత శుభ దినంగా పరిగణిస్తారు. అందుకే ఈ పర్వదినాన మేకర్స్‌ తమ చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇస్తుంటారు

టాలీవుడ్‌కు (Tollywood) పండుగ (Dasara Festival) సెంటిమెంట్‌ బాగా ఎక్కువ. అందులోనూ దసరా పండుగా అనగానే అత్యంత శుభ దినంగా పరిగణిస్తారు. అందుకే ఈ పర్వదినాన మేకర్స్‌ తమ చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇస్తుంటారు. శనివారం దసరా సందర్భంగ అదిరిపోయే అప్‌డేట్స్‌ టాలీవుడ్‌లో సందడి చేశాయి. నందమూరి బాలకృష్ణ (NBK 109) తదుపరి చిత్రం అప్‌డేట్‌తో అభిమానులో నూతన ఉత్సాహాన్ని నింపారు. మాస్‌ పల్స్‌ బాగా తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో (boyapati Srinu) మరో సినిమా ప్రకటించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న నాలుగో చిత్రమిది. దసరా సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. బీబీ4 (BB4) వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. అక్టోబర్‌ 16న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.  రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

BB4.jpg

యువ కథానాయకుడు సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) కూడా తన నూతన చిత్రం గురించి అప్‌డేట్‌ ఇచ్చారు. రవికాంత్‌ పేరెపు దర్శకత్వంలో 'కోహినూర్‌’ (kohinoor) టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కనుంది. మొదటి భాగం 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ‘‘మా హక్కులను చెప్పడానికి మేం 1000 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాం. భద్రకాళి వైభవాన్ని ఈ వీరుడు తిరిగి తీసుకువస్తాడు’’ అంటూ నిర్మాత నాగవంశీ పవర్‌ఫుల్‌ పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

Kohinoor.jpg


వరుణ్‌ తేజ్‌ (varun Tej) హీరోగా కరుణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న 'మట్కా' (Matka) చిత్రం నుంచి కొత్త లుక్‌ను విడుదల చేశారు. నవంబర్‌ 14న ఈ చిత్రం విడుదల కానుంది.

matka.jpg
దసరా సందర్భంగా సందడి చేసిన మరిన్ని చిత్రాల పోస్టర్లు..

రాబిన్ హుడ్...

Robin-hood.jpg

రాచరికం 

Racharikam.jpg
ప్రీ వెడ్డింగ్ షో...

Show.jpg

దేవకీ నందన వాసుదేవ 

Vasudeva.jpg

మెకానిక్ రాకీ 

Rockey.jpg

పొట్టెల్ 

pottel.jpg

లక్కీ భాస్కర్...

lucky.jpg

Updated Date - Oct 12 , 2024 | 03:25 PM