Maharaja Twitter Review: విజ‌య్ సేతుప‌తి ‘మ‌హారాజా’ ఎలా ఉందంటే! ట్విట్ట‌ర్ రివ్యూ

ABN , Publish Date - Jun 14 , 2024 | 09:42 AM

విజ‌య్ సేతుప‌తి క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం మ‌హారాజా. విజ‌య్ సేతుప‌తి 50వ చిత్రంగా ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన ఈ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా మూవీని గురించి నెటిజ‌న్లు త‌మ అభిప్రాయాల‌ను, రివ్యూల‌ను ట్విట్ట‌ర్ ద్వారా పంచుకుంటున్నారు.

Maharaja Twitter Review: విజ‌య్ సేతుప‌తి ‘మ‌హారాజా’ ఎలా ఉందంటే! ట్విట్ట‌ర్ రివ్యూ
vijay sethupathi

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి (VijaySethupathi) క‌థానాయ‌కుడిగా అభిరామి (Abhirami), మ‌మ‌తా మోహ‌న్ దాస్ (Mamta Mohandas), బాలీవుడ్ డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్వ‌ప్ (Anurag Kashyap) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం మ‌హారాజా (Maharaja). నిథిల‌న్ స్వామినాథ‌న్ ( Nithilan Swaminathan) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంట్రైల‌ర్‌తోనే మంచి హైప్ తెచ్చుకుంది. విజ‌య్ సేతుప‌తి 50వ చిత్రంగా ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన ఈ సినిమా ఈ రోజు (శుక్ర‌వారం) ప్ర‌పంచ వ్యాప్తంగా త‌మిళంతో పాటు తెలుగులోనూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా అన్ని ప్రాంతాలలో మూవీని చూసిన వారు త‌మ అభిప్రాయాల‌ను, రివ్యూల‌ను ఇస్తున్నారు.

maharaja

మ‌హారాజా ఓ బార్బ‌ర్ త‌న కూతురు జ్యోతితో క‌లిసి న‌గ‌రానికి దూరంగా ఉంటారు. అయితే ఓ రోజు త‌న ఇంటిపై ఓ ముగ్గురు వ్య‌క్తులు దాడి చేశార‌ని,అ సంద‌ర్భంలో ల‌క్ష్మీ మిస్స‌యిందంటూ పోలీస్ స్టేష‌న్‌లో కంప్లైంట్ ఇస్తాడు. ఈ క్ర‌మంలో క‌థ అనేక మ‌లుపులు తిరుగుతూ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది. ల‌క్ష్మి కోసం వెతుకుతూ సినిమా సాగుతుంది.ఈక్ర‌మంలో ప్ర‌తి స‌న్నివేశంలో విజ‌య్ సేతుప‌తి న‌ట‌న నెక్ట్స్ లెవ‌ల్‌లో ఉంద‌ని, చాలా కాలం త‌క్వాత సాలీడ్ కంటెంట్‌తో వ‌చ్చాడంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. సినిమాకు ఎక్క‌డా ఒంక బెట్ట‌డానికి లేకుండా అదిరిపోయే ట్విస్టుల‌తో, విజ‌య్ కామెడీ టైమింగ్‌తోనూ ఆక‌ట్టుకున్నార‌ని అంటున్నారు.


విజ‌య్ కెరీర్‌లోనే మ‌హ‌రాజా (Maharaja) ది బెస్ట్ మూవీ అని, సినిమాలోని ప్ర‌తి క్యారెక్ట‌ర్‌కు మంచి స్కోప్ ల‌భించ‌డంతో పాటు ఫ‌ర్ఫెక్ట్ న‌టీన‌టుల ఎంపిక జ‌రిగిందంటున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ సినిమాకు ప్రాణంలా ఉందంటూ రివ్యూలు ఇస్తున్నారు. చిత్రం ప్రారంభం కాస్త స్లోగా మొద‌లైన త‌ర్వాత క్ర‌మంగా మ‌న‌ల్ని సినిమాలోకి తీసుకెళుతుంద‌ని, ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌, చివ‌ర‌లో వ‌చ్చే ట్విస్టులు, యాక్ష‌న్ స‌న్నివేశాలు గూస్‌బమ్స్ తెచ్చేలా ఉన్నాయంటూ సినిమాను అసాంతం ఆకాశానికి ఎత్తేస్తున్నారు. స్క్రీన్ ప్లే, ఎమోష‌న్ సీన్స్ సినిమాకు బ‌ల‌మ‌ని నెటిజ‌రన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు చాలా మంది 5కు 3, 4కు త‌గ్గ‌కుండా రేటింగ్ ఇస్తుండ‌గా మ‌రికొంత మంది 4.5 ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

Updated Date - Jun 14 , 2024 | 11:04 AM