పెళ్లికి సిద్ధమైన హీరోయిన్‌

కోలీవుడ్‌ హీరోయిన్‌ రమ్య పాండియన్

పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయింది

 పంజాబ్‌కు చెందిన యోగా ట్రైనర్‌ను ఆమె వివాహమాడనుంది

రిషికేశ్‌లో వీరి వివాహం జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి

 ‘జోకర్‌’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రమ్య..

ఆ తర్వాత అనేక చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది

‘కుక్‌ విత్‌ కోమాలి’ అనే బుల్లితెర కార్యక్రమంతో ప్రేక్షకులకు దగ్గరైంది

బెంగళూరులో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సెంటరులో యోగా శిక్షణ పొందే సమయంలో

అక్కడ ట్రైనర్‌గా పనిచేసే లోవెల్‌ ధవన్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది

దీంతో వీరిద్దరు పెద్దలను  ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు 

లోవెల్‌ ధవన్‌ పంజాబ్‌  లుథియానాలో ఉన్న పబ్లిక్‌ లేబోరేటరీస్‌కు యజమాని

వీరిద్దరి వివాహం వచ్చే నెల 8న జరగనుందని, నవంబరు 15న చెన్నైలో

గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నట్టు  

కోలీవుడ్‌ వర్గాల సమాచారం