కమిట్‌మెంట్ ఇవ్వాలని  సిగ్గు లేకుండా అడిగాడు..

‘ఈ మాయ పేరేమిటో’ అంటూ తొలి సినిమాతోనే యువతరాన్ని తన మాయలో పడేసింది కావ్య థాపర్.

వరుస సినిమాలతో బిజీ హీరోయిన్‌గా మారిందీ పంజాబీ భామ.

‘డబుల్ ఇస్మార్ట్’, ‘విశ్వం’ సినిమాలతో గ్లామర్‌తో రచ్చలేపిందీ బ్యూటీ.

అయితే ఈ బ్యూటీ కెరీర్ తొలినాళ్లలో క్యాస్టింగ్ కౌచ్‌‌ని ఎదుర్కొందట.

ఈ విషయం స్వయంగా ఆమెనే చెప్పుకొచ్చింది.

కెరీర్ తొలినాళ్లలో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా. 

ఒక యాడ్‌లో ఆఫర్ ఉందంటే ఆయన ఆఫీస్‌కు వెళ్లా..

నాలుగు పెద్ద యాడ్స్‌లో నటించే ఛాన్స్ ఇస్తానని అన్నాడు.

ఆ ఆఫర్ మీకు ఖరారు చేయాలంటే మాత్రం..

కమిట్‌మెంట్ ఇవ్వాలని నిస్సిగ్గుగా అడిగాడు.

అలాంటివి నాకు ఇష్టం ఉండవని ముఖం మీదే చెప్పేశా. 

అయినా అదే పనిగా రెట్టిస్తూ ఉండటంతో.. అక్కడి నుండి వెంటనే బయటికి వచ్చేశా.

నన్ను నటిగా చూడాలన్నది నాన్న కల.

అందుకే గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే నటనపై దృష్టి పెట్టా. 

పతంజలి, మేక్ మై ట్రిప్ ప్రకటనలలో చేశా.. వాటిని చూసే ‘ఈ మాయ పేరేమిటో’ ఛాన్స్ వచ్చింది.