ఎవరితోనైనా డేట్‌కి వెళ్తే.. బిల్లు నేనే చెల్లించేదాన్ని

తాజాగా బ్యూటీ శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమన్నారంటే..

మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా ఉండటం ఎంతో ముఖ్యం.

ఆర్థిక విషయాల్లో ఇతరులపై ఆధారపడటం నాకు నచ్చదు. 

ఎప్పుడైనా ఎవరితోనైనా నేను డేట్‌కి వెళ్లినా సరే..

బిల్లు నేనే చెల్లించేదాన్ని అని అన్నారు శ్రుతిహాసన్‌. 

కొందరు అబ్బాయిలు ఖర్చులన్నీ తనతోనే పెట్టించేవారని ఓ పాడ్‌ కాస్ట్‌లో ఆమె చెప్పారు.

మొదట్లో ఎదుటి వ్యక్తిని అడగకుండానే నేను అన్నింటికీ డబ్బులు చెల్లించేదాన్ని.

కొంత కాలం తర్వాత ఎప్పుడైనా ఈ విషయాన్ని అడిగితే.. 

నువ్వు ఇష్టపడి కడుతున్నావేమో అనుకున్నామని అంటారు. 

ఇలాంటి అనుభవాలు ఎదురైన తర్వాత డబ్బుల విషయంలో.. 

స్పష్టమైన వైఖరితో ఉండాలని అర్థం చేసుకున్నానని శ్రుతిహాసన్‌ చెప్పారు.