జయరామ్‌ తనయుడు కాళిదాస్‌ పెళ్లి ఫొటోలు వైరల్

జయరామ్‌ తనయుడు, నటుడు కాళిదాస్‌ ఓ ఇంటివాడయ్యారు. 

మోడల్‌ తరిణిని కాళిదాస్‌ జయరామ్ పెళ్లి చేసుకున్నారు. 

కేరళలోని గురువాయూర్‌ శ్రీకృష్ణ దేవాలయంలో ఆదివారం ఉదయం జరిగిన వేడుకకు 

ఇరు కుటుంబాలతోపాటు కేంద్ర పర్యాటక సహాయ మంత్రి సురేశ్‌గోపి దంపతులు హాజరయ్యారు. 

పెళ్లి ఫొటోలను కాళిదాస్‌ సోషల్‌ మీడియా వేదికగా పంచుకోగా.. 

నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలుసుతున్నారు.

కాళిదాసు జయరామ్‌ ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించారు. 

మలయాళ, తమిళ భాషల్లో 20కి పైగా చిత్రాల్లో నటించారు. 

ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన తొలి చిత్రంతోనే జాతీయ పురస్కారం అందుకున్నారు. 

ఈ ఏడాది ఇండియన్‌ 2, రాయన్‌ చితాల్రతో కాళిదాస్ జయరామ్ అలరించారు