ప్రియాంక చోప్రా అలా.. వాళ్ల అమ్మ ఏమో ఇలా..

నటి ప్రియాంక జోనాస్‌ బాలీవుడ్‌కు తిరిగి వచ్చేస్తున్నారనే వార్తలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

రీసెంట్‌గా సిటాడెల్‌ వెబ్‌సిరీస్‌ షూటింగ్‌లో పాల్గొన్న ప్రియాంక తాను త్వరలో హిందీ సినిమా చేయబోతున్నట్లు హింట్‌ ఇచ్చారు.

అయితే ఈ వార్తలు చక్కర్లు కొడుతుండగానే ప్రియాంక తల్లి మధు చోప్రా మాత్రం 

తమ ప్రొడక్షన్‌ హౌస్‌ కార్యకలాపాలను అమెరికాకు షిష్ట్‌ చేసినట్లు వెల్లడించారు. 

ఈ మేరకు ఆమె ఓ భారతీయ మీడియా సంస్థతో జరిపిన చాట్‌ ప్రియాంక బాలీవుడ్‌కు వచ్చే అవకాశాలు లేవనే వాదనకు బలం చేకూరుస్తోంది.

‘మా ప్రొడక్షన్‌ హౌస్‌ ‘పర్పల్‌ పెబ్బల్‌’ ఆమెరికా తరలిపోయింది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఏ సినిమాలూ చేయడం లేదు. 

కానీ ప్రియాంక ఇండియాకు వస్తే... అప్పుడు ఆలోచిస్తాం. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్లాన్‌లు లేవు’ అని పేర్కొన్నారు. 

ప్రియాంక రాకకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఆమె అభిమానులకు,

మరీ ముఖ్యంగా ‘జీలే జరా’ మూవీలో ప్రియాంకతో కలసి నటించిన 

అలియా భట్‌, కత్రీనా కైఫ్‌లకు మధు చోప్రా మాటలు నిరాశ కలిగించాయి. 

2021లో ప్రారంభమైన ‘జీలే జరా’ సినిమా షూటింగ్‌ కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆటకెక్కినట్లు వార్తలొచ్చాయి.

ఈ సినిమా నిర్మాణాన్ని ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌పై ఫర్హాన్‌ అక్తర్‌ మొదలు పెట్టారు. 

అయితే ఈ మూవీ అప్డేట్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు ప్రియాంక సమాధానాలు దాటవేశారు.

ఈ సినిమా గురించి తన వద్ద సమాచారం లేదంటూనే... ఈ ప్రాజెక్టుపై ఆశావాదంతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. 

కాగా, అనేక ఇంటర్నేషనల్‌ కమిట్‌మెంట్స్‌ ఉన్నప్పటికీ బాలీవుడ్‌కి తిరిగి వస్తున్నానంటూ 

తన అభిమానులను ఆటపట్టిస్తూ ‘ఇక్కడ ఎంతో మంది నిర్మాతలను కలుస్తుంటాను. స్ర్కిప్ట్‌లను చదువుతున్నాను. 

హిందీలో ఏదైనా చేయాలనే అమితాసక్తితో ఉన్నాను’ అని పేర్కొన్నారు. 

ప్రస్తుతం హాలీవుడ్‌లో సిటాడెల్‌ సీజన్‌-2తో పాటు ‘ద బ్లఫ్‌’, ‘హెడ్స్‌ ఆఫ్‌ స్టేట్‌’ చిత్రాల షూటింగ్‌ను ప్రియాంక పూర్తి చేశారు.