అందమైన అమ్మాయ్ అన్నా అని పిలిచింది.. ఫీలయ్యా

అందమైన అమ్మాయిని చూస్తే ఎవరికైనా మాట్లాడాలనిపిస్తుంది. 

సరదాగా కాసేపు కబుర్లు చెప్పాలనిపించడమూ కామన్‌. 

అయితే అప్పుడు ఆ అమ్మాయి ‘అన్నా’ అంటే మాత్రం అబ్బాయిలు తట్టుకోలేరు. 

ఈ విషయంలో మన సినిమా హీరోలు కూడా అతీతం కాదు. 

సరిగ్గా ఇలాంటి పరిస్థితే శివకార్తీకేయన్‌కు ఎదురైందట.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ‘అమరన్‌’ ఆడియో వేడుకలో చెప్పారు.

నేను ఓ టీవీ చానెల్‌లో పనిచేసేటప్పుడు సాయిపల్లవిని మొదటిసారి కలిశాను. 

అందులో ఓ షో కోసం నేను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నప్పుడు సాయి పల్లవి ఆ కార్యక్రమానికి వచ్చారు.

ఇండస్ట్రీలో ఆమె పేరే ఒక బ్రాండ్‌. ‘ప్రేమమ్‌’ సినిమాలో ఆమె నటనను చూసి ఫోన్‌ చేసి ప్రశంసించాను.

ఆమె అందుకు ‘థ్యాంక్యూ అన్నా’ అన్నారు. సాయి పల్లవి అలా పిలిచేసరికి ఫీల్‌ అయ్యా’’ అని చెప్పారు. 

ఈ విషయాన్ని శివ కార్తీకేయన్‌ స్టేజీ మీద చెప్తున్ననంత సేపూ సాయి పల్లవి నవ్వుతూనే ఉన్నారు.