టాప్ 1లో యానిమల్ బ్యూటీ.. స్టార్లకు ఝలక్

‘లైలా మజ్ను’, ‘కళ’ సినిమాల్లో కథానాయికగా నటించినా..

‘యానిమల్‌’లో చేసిన  ఓ చిన్న పాత్రతో 

నేషనల్‌ వైడ్‌ సెన్సేషన్‌ అయ్యారు బాలీవుడ్‌ త్రిప్తీ దిమ్రి. 

ఇటీవలే ‘బ్యాడ్‌ న్యూజ్‌’, ‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’,

‘భూల్‌ భూలయ్యా-3’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారీ బ్యూటీ. 

తాజాగా, ఈ నటి ఓ అరుదైన గౌరవాన్ని పొందారు.

ఐఎమ్‌డీబీ వెబ్‌సైట్‌, 2024లో అత్యంత ప్రజాదరణ పొందిన 

పది మంది భారతీయ స్టార్స్‌ లిస్ట్‌ను ప్రకటించింది. 

ఇందులో త్రిప్తి మొదటి స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

ఈ సందర్భంగా ఆమె అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ లిస్ట్‌లో రెండో స్థానంలో దీపిక పదుకొణే,

3వ స్థానంలో ‘ధడక్‌’ ఫేమ్‌ ఇషాన్‌ కట్టర్‌, 

నాలుగో స్థానంలో షారుక్‌ ఖాన్‌,

ఐదో స్థానంలో శోభిత ధూళిపాళ..

ఆరో స్థానంలో శార్వరీ

ఏడవ స్థానంలో ఐశ్వర్యరాయ్ బచ్చన్

ఎనిమిదవ స్థానంలో సమంత

తొమ్మిదో స్థానంలో ఆలియా భట్‌ 

పదో స్థానంలో ప్రభాస్‌ ఉన్నారు.