Game Changer: ‘గేమ్ ఛేంజ‌ర్‌’ రెండో పాట వచ్చేది ఎప్పుడంటే..

ABN , Publish Date - Sep 25 , 2024 | 06:06 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగా వేచి చూస్తున్నారనేది తెలిసిన విషయమే. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ అప్డేట్ వదిలారు. అదేంటంటే..

Game Changer Movie Still

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ (Game Changer). ఈ సినిమాపై రోజురోజుకీ ఏ విధంగా అంచనాలు పెరుగుతున్నాయో తెలిసిందే. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. 2024 క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రెండో సాంగ్ అప్డేట్‌ని మేకర్స్ తెలియజేశారు.

Also Read- Prakash Raj: ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ మరోసారి పవన్‌ కళ్యాణ్‌కు కౌంటర్

‘గేమ్ ఛేంజ‌ర్‌’ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్‌, సినీ ల‌వ‌ర్స్ ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ ఈ క్రేజీ అప్డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సెప్టెంబ‌ర్ 28న సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘రా మ‌చ్చా మ‌చ్చా’ (Ra Macha Macha) ప్రోమో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ తెలియ‌జేశారు. ఫుల్ సాంగ్ ఎప్పుడొచ్చేది.. ప్రోమోలో తెలిపే అవకాశం ఉంది. ఇక ఈ ప‌ల్ల‌విలోని లైన్స్ చూస్తుంటే.. త‌మ‌న్ సంగీత సార‌థ్యం నుంచి వస్తోన్న ఈ పాట ప‌క్కా మాస్ బీట్ సాంగ్ అనేది స్పష్టమవుతోంది. ఈ పాట‌ను ప్ర‌ముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ రాశారు. (Game Changer Second Song)

Also Read- Devara: వార్స్ వద్దు.. ‘దేవర’ అభిమానులకు నిర్మాత నాగవంశీ రిక్వెస్ట్


Game-Changer.jpg

ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టికే విడుదలైన ‘జరగండి జరగండి..’ సాంగ్ ఎంత సెన్సేష‌న్ అయ్యిందో తెలిసిందే. తాజాగా సెకండ్ సాంగ్‌కు సంబంధించిన అప్డేట్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్ష‌కుల్లోనూ స‌రికొత్త ఎన‌ర్జీనిచ్చింది. ‘విన‌య విధేయ రామ’ చిత్రంలో జోడీగా మెప్పించిన రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ.. ‘గేమ్ ఛేంజ‌ర్‌’లో మరోసారి అల‌రించ‌టానికి రెడీ అయ్యారు. ఈ క్యూట్ పెయిర్ సంద‌డిని సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడాల‌నే ఉత్సాహం అంద‌రిలోనూ క‌నిపిస్తోంది. ఇయ‌ర్ ఎండింగ్‌లో క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ టు న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ అన్నీ మావే అనే కాన్ఫిడెన్స్ గేమ్ ఛేంజ‌ర్ యూనిట్‌లో క‌నిపిస్తోంది. అలాగే ఇప్పటి వరకు అప్డేట్స్ కోసం వేచి చూసిన ఫ్యాన్స్‌కి.. ఇకపై తనవితీరా ట్రీట్స్ ఉండబోతున్నాయనేది కూడా ఈ అప్డేట్‌తో క్లారిటీ వచ్చేసింది. లార్జ‌ర్ దేన్ లైఫ్ చిత్రాల‌ను అబ్బుర‌ప‌రిచే రీతిలో తెర‌కెక్కించే శంకర్ ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌కెక్కించిన సినిమాల‌ను మించేలా ఈ ‘గేమ్ ఛేంజ‌ర్‌’ను రూపొందిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకి దక్కించుకుంది.

Also Read- Pawan Vs Prakash Raj: పవన్‌కల్యాణ్‌కు ప్రకాశ్‌రాజ్‌ కౌంటర్‌

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 25 , 2024 | 06:06 PM

Game Changer Audio Rights : ఆడియో రైట్స్‌కు ఎన్ని కోట్లంటే...

Game Changer: మెగా మాస్‌ బ్లాస్ట్‌..వచ్చేస్తుంది

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..

Game Changer: జాబిల‌మ్మ జాకెట్టెసుకొచ్చెనండి.. జ‌ర‌గండి జ‌ర‌గండి పాటొచ్చింది

Game Changer: రిలీజ్ డేట్‌తో ఫ్యాన్ మేడ్ పోస్టర్.. చిత్ర టీమ్‌ని కూడా కన్ఫ్యూజ్ చేస్తోంది.