Patang: ‘ప‌తంగ్’ మ్యాచ్‌లో క‌లుద్దాం.. యూత్ ఫెస్టివల్‌కి రెడీ అయిపోండి

ABN , Publish Date - May 03 , 2024 | 10:55 PM

తొలిసారిగా ప‌తంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘ప‌తంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిష‌న్ సినిమాస్ ప‌తాకంపై విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మ‌క, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి ద‌ర్శ‌కుడు. నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా వ్య‌వ‌హ‌రించిన ఈ చిత్ర టీజర్‌ని తాజాగా దర్శకుడు బుచ్చిబాబు సానా చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Patang: ‘ప‌తంగ్’ మ్యాచ్‌లో క‌లుద్దాం.. యూత్ ఫెస్టివల్‌కి రెడీ అయిపోండి
Patang Teaser Launch Event

ఇప్ప‌టి వ‌ర‌కు భార‌తీయ సినిమాలో ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్ష‌కులు చూసి వుంటారు. కాని తొలిసారిగా ప‌తంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘ప‌తంగ్’ (Patang). సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిష‌న్ సినిమాస్ ప‌తాకంపై విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మ‌క, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి ద‌ర్శ‌కుడు. నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేష‌న్ ప్రీతి ప‌గ‌డాల‌, జీ స‌రిగ‌మ‌ప ర‌న్న‌ర‌ప్ ప్ర‌ణ‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్య‌తార‌లుగా న‌టిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం వేస‌విలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం టీజ‌ర్‌ను గురువారం ప్ర‌సాద్ ఐమ్యాక్స్‌లో జ‌రిగిన వేడుక‌లో గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ (Global Star Ram Charan)తో పాన్ ఇండియా సినిమాను తెర‌కెక్కిస్తున్న బుచ్చిబాబు సానా (Buchibabu Sana) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. (Patang Teaser Launch Event)

టీజర్ విడుదల అనంతరం బుచ్బిబాబు మాట్లాడుతూ.. ఇందులోని కంటెంట్ చూస్తుంటే సినిమా షూర్ షాట్ హిట్ అనిపిస్తుంది. ఈ సినిమాకు ఆ యూత్‌ఫుల్ వైబ్ క‌నిపిస్తుంది. మ‌రో ‘హ్య‌పీడేస్‌’లా ఘ‌న‌విజయం సాధిస్తుందని అనిపిస్తుంది. నాని, నేను మా గురువు గారు సుకుమార్ ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న‌ప్పుడు నాకు తెలుసు. మంచి టెక్నిక‌ల్ నాలెడ్జ్ వుంది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించి అంద‌రికి మంచి పేరును తీసుకురావాలని అన్నారు. (Patang Teaser Launched)


Patang-Movie.jpg

ద‌ర్శ‌కుడు ప్ర‌ణీత్ మాట్లాడుతూ.. సినిమా టీజ‌ర్ న‌చ్చితే అంద‌రికి సినిమా న‌చ్చిన‌ట్టే. ఒక తెలుగు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో వున్న ఎలిమెంట్స్ వున్నాయి. త‌ప్ప‌కుండా సినిమా అందరికీ న‌చ్చుతుంది. టీజ‌ర్‌లో చెప్పిన‌ట్లుగా మ్యాచ్‌లో క‌లుద్దామని అన్నారు. నిర్మాత సంప‌త్ మ‌క మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా వ్య‌య ప్ర‌యాసల‌తో జ‌రిగింది. ఈ గాలిప‌టం దారం తెగ‌కుండా చూసుకున్నాడు నాని. ఈ రోజు సినిమా బాగా రావ‌డానికి టీమ్ అంతా కృషి చేశారు. టీజ‌ర్‌లో వున్న‌ట్లు అంద‌రూ మ్యాచ్ కోసం ఈసినిమా మ‌ళ్లీ మ‌ళ్లీ చూస్తారు. క్రియేటివ్ నిర్మాత నాని బండ్రెడ్డి మాట్లాడుతూ.. ఎంతో బిజీగా రెహ‌మాన్ గారితో మ్యూజిక్ సిట్టింగ్స్‌లో వున్న బుచ్చిబాబుగారు మా మీద ప్రేమ‌తో వ‌చ్చినందుకు కృత‌జ్ఞతలు తెలియ‌జేస్తున్నాను. త‌ప్ప‌కుండా ఈ సినిమా అంద‌ర్ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ఈ సినిమా థియేట‌ర్స్‌లో యూత్‌ఫెస్టివ‌ల్స్ జ‌రుగుతాయని అన్నారు.

Updated Date - May 03 , 2024 | 10:55 PM