Vettaiyan: ‘వేట్టైయాన్’ ఫస్ట్ సింగిల్ టైమ్ ఆగయా..

ABN , Publish Date - Sep 07 , 2024 | 03:36 PM

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా భారీ బ‌డ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘వేట్టైయాన్’. బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు ‘2.0, ద‌ర్బార్‌, లాల్ స‌లామ్’ వంటి చిత్రాల త‌ర్వాత ర‌జినీకాంత్, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో రాబోతున్న నాలుగో సినిమా ‘వేట్టైయాన్’. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్‌డేట్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Super Star Rajinikanth in Vettaiyan

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth) హీరోగా భారీ బ‌డ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ (Lyca Productions) బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘వేట్టైయాన్’ (Vettaiyan). బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు ‘2.0, ద‌ర్బార్‌, లాల్ స‌లామ్’ వంటి చిత్రాల త‌ర్వాత ర‌జినీకాంత్, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో రాబోతున్న నాలుగో సినిమా ‘వేట్టైయాన్’. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 10న భారీ ఎత్తున విడుద‌ల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సామాజిక ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌ను తెలియ‌జేసేలా సినిమాలు చేస్తూ విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లను అందుకున్న ద‌ర్శ‌కుడు టి.జె.జ్ఞాన‌వేల్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌ని మేకర్స్ వదిలారు.

Also Read- Tollywood - Vinayaka Chavithi: దండాలయ్యా.. ఉండ్రాలయ్యా.. కరుణించయ్యా దేవా..

ప్రస్తుతం ‘వేట్టైయాన్’ ప్రమోషన్స్‌లో వేగం పుంజుకుంది. అందులో భాగంగా ఈ సినిమా నుంచి తొలి పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. ‘పేట‌, ద‌ర్బార్‌, జైల‌ర్’ చిత్రాల త‌ర్వాత‌ ర‌జినీకాంత్, రాక్ స్టార్ అనిరుద్ ర‌విచంద‌ర్ క‌ల‌యిక‌లోనూ రానున్న నాలుగో సినిమా కూడా ఇదే కావ‌టం విశేషం. సూప‌ర్ స్టార్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టు ఆయ‌న అభిమానులు స‌హా అంద‌రినీ దృష్టిలో పెట్టుకుని అనిరుధ్ మ‌రోసారి త‌న‌దైన పంథాలో బాణీల‌ను అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి సెప్టెంబ‌ర్ 9న ‘మనసిలాయో..’ అనే పాట‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. (Vettaiyan 1st Single Release Update)


Rajini.jpg

ఈ పాన్ ఇండియా మూవీని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కిస్తున్నారు. సినిమాకు సంబంధించి వస్తున్న ప్ర‌తీ అనౌన్స్‌మెంట్‌ సినిమాపై భారీ అంచ‌నాలను, క్రేజ్‌నూ పెంచుతూనే ఉంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రంలో మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్, రానా ద‌గ్గుబాటి, రితికా సింగ్‌, దుష‌రా విజ‌య‌న్, రోహిణి, అభిరామి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఆడియెన్స్‌కు స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వ‌టానికి సిద్ధ‌మ‌వుతోన్న ఈ పాన్ ఇండియా సినిమా త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ భాషల్లో రిలీజ్ కానుంది.

Read Latest Cinema News

Updated Date - Sep 07 , 2024 | 03:59 PM

Vettaiyan: అక్టోబ‌ర్ 10న థియేట‌ర్ల‌లోకి.. ర‌జ‌నీకాంత్‌ ‘వేట్టైయాన్’

Vettaiyan: కమల్ హాసనే కాదు.. రజినీకాంత్ కూడా అప్డేట్ ఇచ్చాడు..

Vettaiyan: చకచకా.. ‘వేట్టయాన్‌’ డబ్బింగ్‌

Vettaiyan: బిగ్‌బీ, తలైవా కలిసిన వేళ..

VettaiyanVsKanguva: ‘వేట్టయాన్‌’తో ‘కంగువా’ పోటీ.. ఎవ‌రు నిలిచేనో