Pawan Kalyan: పవన్ కల్యాణ్ విజయం కోసం కష్టపడ్డ ఆ ముగ్గురు సినీ ప్రముఖులు..
ABN , Publish Date - Jun 06 , 2024 | 02:39 PM
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అఖండ విజయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుభవం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడును ప్రధాన కారణాలుగా రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయ క్షేత్రంలో బ్యాలెన్స్‌డ్‌గా ఉంటూ కూటమిని నడిపించిన తీరు.. 100 శాతం సక్సెస్ రేట్ అందుకున్న విధానం ప్రశంసలను అందుకుంటోంది. అయితే ఈ గెలుపుకు ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా కృషి చేసినట్లుగా టాక్ వినబడుతోంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కూటమి అఖండ విజయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అనుభవం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దూకుడును ప్రధాన కారణాలుగా రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయ క్షేత్రంలో బ్యాలెన్స్‌డ్‌గా ఉంటూ కూటమిని నడిపించిన తీరు.. 100 శాతం సక్సెస్ రేట్ అందుకున్న విధానం ప్రశంసలను అందుకుంటోంది. అయితే గత పదేళ్లుగా వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలను, సవాళ్లను ఎదుర్కొన్న పవన్ కల్యాణ్, వాటన్నింటికీ ఈ విజయంతో సమాధానమిచ్చినట్లు అయింది. అయితే ఇన్నాళ్ళు అపజయాలు ఎదురైనా పవన్ కళ్యాణ్ వెనకడుగు వేయకుండా ఈ ఎన్నికలలో విజయాన్ని సాధించటం వెనుక ఆయన వ్యూహంతో పాటు ముగ్గురు సినీ ప్రముఖులు కీలకంగా నిలిచారు. వారెవరంటే..
పవన్ కళ్యాణ్ వెనుక ఉండి.. మొదటి నుంచి అన్నివిధాలుగా అండగా ఉన్న వ్యక్తి.. ఆయన సోదరుడు నాగబాబు (Mega Brother Nagababu). ఈ సారి ఎన్నికలలో పోటీ నుంచి తప్పుకుని మరీ పవన్ విజయం కోసం గ్రౌండ్ లెవెల్‌లో తీవ్రంగా వర్క్ చేశారు. క్యాడర్‌ను కూటగట్టుకుని, పవన్‌కు కూటమి ఓట్లను సమీకరించటంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావటంతో, నాగబాబుకు రాజ్యసభ సీట్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు టీటీడీ ఛైర్మన్ అనేలా కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. పిఠాపురంలో పవన్‌కు సపోర్ట్‌గా మెగా హీరోలు, జబర్దస్త్ నటులు స్వచ్ఛందంగా వచ్చి ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని నియోజకవర్గంలో ప్రతి ఇంటికి, వ్యక్తికి రీచ్ అయ్యేలా మెహర్ రమేష్ (Meher Ramesh) కృషి చేశారు. పవన్ ఇతర నియోజకవర్గాలలో ప్రచారం చేసుకున్నా, రాష్ట్రవ్యాప్తంగా పిఠాపురం (Pithapuram)పై అందరి ఫోకస్ పడటానికి మెహర్ రమేష్ ప్లానింగ్ ఉపయోగపడింది.
Also Read- Pawan Kalyan: పవర్ స్టార్ నిజజీవితంలో కూడా పవర్ ఫుల్, హోమ్ మినిస్టర్?
ఇక వీరిద్దరే కాకుండా.. తొలి నుంచి పవన్ కల్యాణ్‌కు ఓ స్నేహితుడిగా ఉంటూ వ్యక్తిగతంగా పార్టీ పరంగా సలహాలు సూచనలు ఇస్తూ వస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). పవన్ కల్యాణ్ ఆవేశపూరిత స్పీచ్‌ల వెనుక కంటెంట్ క్రియేటర్ త్రివిక్రమ్ అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఎన్నికల కోసం క్రియేట్ చేసిన ‘హాయ్ ఏపీ.. బై బై వైసీపీ’ నినాదం బాగా హైలైట్ అయింది. ఎక్కడ ప్రచారానికి వెళ్లినా డిజె పెట్టి మరీ పవన్ ఈ స్లోగన్‌ను ప్లే చేస్తూ ఊగిపోయారు. ఈ నివాదాన్ని ప్రజల్లోకి చొచ్చుకు పోయేలా చేయగలిగారు. ఇలా పవన్ విజయం వెనుక ముగ్గురు సినీ ప్రముఖులు కీలకంగా వ్యవహరించారు.
వీరే కాక పవన్ మీద అభిమానంతో జనసేన పార్టీకి అండగా నిలిచిన నిర్మాతలు ఉన్నారు. పవన్ కల్యాణ్‌తో సినిమాలు నిర్మించిన, నిర్మిస్తున్న బివిఎస్ఎన్ ప్రసాద్, ఎ.ఎం .రత్నం, నాగవంశీ, డీవీవీ దానయ్య వంటి నిర్మాతలు (Tollywood Top Producers) సినిమా చిత్రీకరణలను కూడా పక్కనపెట్టి పవన్ కల్యాణ్ విజయం కోసం తమదైన సహాయసహకారాలను అందించారు. వీటన్నింటినీ మించి ఎన్నికలకు ముందు తొలిసారి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నేరుగా పవన్ కల్యాణ్‌కు వ్యక్తిగతంగా తన మద్దతును ప్రకటించి, అసెంబ్లీలో నా తమ్ముడు అడుగుపెట్టాలని కోరుతూ.. ఆర్థికంగానూ ప్రోత్సహించడం క్యాడర్‌కు కొండంత బలాన్ని అందించింది.