Viswam: వస్తానులే అంటూ కావ్య థాపర్‌తో గోపీచంద్ డ్యూయెట్..

ABN , Publish Date - Oct 04 , 2024 | 08:13 PM

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘విశ్వం’. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ‘మొరాకో మగువా’ పాట హీట్‌ని పుట్టించగా.. తాజాగా మరో సాంగ్‌ని మేకర్స్ వదిలారు. ఈ సాంగ్‌లో కూడా కావ్య తన అందాలతో కట్టిపడేస్తోంది.

Viswam Movie Still

మాచో స్టార్ గోపీచంద్ (Gopichand), దర్శకుడు శ్రీను వైట్ల (Sreenu Vaitla) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘విశ్వం’ (Viswam). ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రీసెంట్ ఈ సినిమాకు సంబంధించి రిలీజైన టీజర్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలు మరింతగా పెంచింది. ఈ సినిమా అటు గోపీచంద్‌కు, ఇటు శ్రీను వైట్లకు ఎంతో ముఖ్యం. ఈ ఇద్దరూ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రమోషన్స్ ప్రస్తుతం యమా జోరుగా మేకర్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ‘వస్తాను వస్తానులే’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ వదిలారు.

Also Read- Jr NTR: దర్శకుడు కొరటాల శివపై ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘మొరాకో మగువా’, సెకెండ్ సింగిల్ ‘మొండి తల్లి పిల్ల నువ్వు’ సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. తాజాగా మేకర్స్ వదిలిన థర్డ్ సింగిల్ ‘వస్తాను వస్తానులే’ (Vastanu Vastanule Lyrical Song) కూడా వినగానే ఆకట్టుకునేలా ఉంది. చేతన్ భరద్వాజ్ లవ్లీ రొమాంటిక్ నంబర్‌గా ఈ సాంగ్‌ని కంపోజ్ చేశారు. వెంగి రాసిన లిరిక్స్ లీడ్ పెయిర్ కెమిస్ట్రీని చాలా లవ్లీగా ప్రజెంట్ చేశాయి. కపిల్ కపిలన్ తన గ్రేస్ ఫుల్ వోకల్స్‌తో కట్టిపడేశారు. ఈ సాంగ్‌లో ఇంతకు ముందు వచ్చిన ‘మొరాకో మగువా’లానే.. గోపీచంద్, కావ్యా థాపర్ కెమిస్ట్రీ మెస్మరైజింగ్‌గా వుంది. ఫారిన్, బీచ్ ల్యాండ్ స్కేప్ లో షూట్ చేసిన ఈ సాంగ్‌లో విజువల్స్ అద్భుతంగా వున్నాయి. థియేటర్స్‌లో ఈ సాంగ్ ఐఫీస్ట్‌లా ఉంటుందనడంలో సందేహమే లేదు. మరీ ముఖ్యంగా కావ్య థాపర్ ఈ పాటలోనూ తన గ్లామర్‌తో కట్టిపడేస్తోంది.


Gopichand.jpg

మాచో స్టార్ గోపీచంద్, కావ్య థాపర్ (Kavya Thapar), వెన్నెల కిషోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెవి గుహన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. ఎడిటర్‌గా అమర్‌రెడ్డి కుడుముల, ఆర్ట్‌ డైరెక్టర్‌ కిరణ్‌ మన్నె బాధ్యతలను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Also Read- Prakash Raj: పవన్ కళ్యాణ్‌పై మరో ట్వీట్ పేల్చిన ప్రకాశ్ రాజ్..

Also Read- Thalapathy 69: విజయ్ లాస్ట్ సినిమా ఓపెనింగ్‌లో ఏం జరిగిందో తెలుసా?

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 04 , 2024 | 08:13 PM

Viswam: ‘విశ్వం’.. మొరాకో మగువా లిరికల్ సాంగ్

Viswam: ‘మొండి తల్లి పిల్ల నువ్వు’.. లిరికల్ సాంగ్

Viswam: గోపీచంద్ లైట్ గడ్డంతో, డార్క్ కళ్లద్దాలు పెట్టుకుని స్టైలిష్‌గా.. ఫస్ట్ స్ట్రైక్!

Viswam: గోపీచంద్ ‘విశ్వం’ మూవీ టీజర్

Viswam: గోపీచంద్ ‘విశ్వం’ నుంచి హార్ట్ టచ్చింగ్ సాంగ్ విడుదల