Happy Birthday NTR: ఒత్తిడి తగ్గించుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ ఏమి చేస్తారో తెలిస్తే షాకవుతారు
ABN , Publish Date - May 20 , 2024 | 12:25 PM
ఒత్తిడిని తగ్గించుకోవటానికి ఒక్కొక్కరు ఒక్కోలా పని చేస్తూ వుంటారు. అదే జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే అతను ఒత్తిడిని తగ్గించుకోవటానికి ఏమి చేస్తారో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ ఏమి చేస్తారంటే...
చలన చిత్ర పరిశ్రమలో ప్రతీ నటుడు కొంచెమైనా ఒత్తిడిలో వుంటారు, ముఖ్యంగా అగ్ర నటులు తమ సినిమా విడుదలప్పుడు, ఆ తరువాత ఎంతో ఒత్తిడికి గురవుతూ వుంటారు. కొందరు కుటుంబంతో కలిసి ఉండటం, కొందరు విదేశీ యానాలు, కొందరు ఇంకా ఏవో చేస్తూ వుంటారు, ఆ ఒత్తిడి నుండి బయటపడటానికి. మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా అటువంటి ఒత్తిడిలో ఉండేటప్పుడు ఏమి చేస్తారో తెలుసా? (Happy Birthday to NTR)
ఒత్తిడి తగ్గించుకోవటానికి జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడికీ వెళ్లారు, ఇంట్లోనే వుండి, వంట చేస్తారు. "ఎప్పుడైనా కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యానంటే మా ఆవిడ కోసం నేను వంట చేసి పెడతాను," అని చెప్పేవారు ఎన్టీఆర్. వంట చెయ్యడం అంటే ఒత్తిడి తగ్గించుకోవటమే అని చెపుతూ వుంటారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎన్టీఆర్ మంచి కుక్, చాలా బాగా వండుతారు, ఒక్కటి అని కాదు, అన్ని కూరలు, పచ్చడిలు అన్నీ బాగా చేస్తారు ఎన్టీఆర్. వంట చెయ్యడం అంటే ఆయనికి ఎంతో ఇష్టం కూడా. (Happy Birthday to Man of Masses Jr NTR)
అలాగే షాపింగ్ అన్న ఎన్టీఆర్ కి చాలా ఇష్టం. ఎక్కువగా దుబాయిలో షాపింగ్ చేస్తూ వుంటారు. దుబాయ్ అంటే ఎన్టీఆర్ కి ఇష్టమైన విహార యాత్రా ప్రదేశం అని చెపుతూ వుంటారు. అలాగే తన కుటుంబంతో విదేశాలకి వెళ్ళటం అంటే ఇంకా ఇష్టం. అలా వెళ్ళినప్పుడు తాను షాపింగ్ చెయ్యడమే కాకుండా, తనతో వచ్చిన అందరికీ కూడా ఎన్టీఆర్ షాపింగ్ చేస్తూ వుంటారు, అదీ అయన స్పెషల్. (Latest update on Jr NTR starrer films)
అలాగే ఎన్టీఆర్ కి అమ్మ తరువాత ఇష్టమైన వ్యక్తి ఎవరంటే తన భార్య ప్రణతి. ఆమె ఎన్టీఆర్ జీవితంలోకి రావటం అతనికి దేవుడిచ్చిన గొప్ప వరం అని చెపుతూ వుంటారు ప్రణతి గురించి. ఎన్టీఆర్ ఎక్కువగా టైము తన ఇద్దరి కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో గడుపుతూ వుంటారు. అందుకే ఎప్పుడైనా విదేశీ షూటింగ్ లకి వెళ్ళినపుడు, అక్కడ తన కుమారులకు ఏదైనా కొని తీసుకు వస్తూ వుంటారు.
ఇక పని విషయానికి వస్తే ఇప్పుడు ఎన్టీఆర్ 'దేవర' అనే సినిమా చిత్రీకరణలో వున్నారు. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకుడు, ఇది రెండు భాగాలుగా విడుదలవుతోంది. మొదటి భాగం చిత్రీకరణ జరుపుకుంటోంది, ఇది అక్టోబర్ 10న విడుదలవుతుంది. అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా ఈ ఆగస్టు నుండి చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. మేన్ అఫ్ మాసెస్ అని పిలుచుకునే ఎన్టీఆర్ ఇప్పుడు 'వార్' అనే ఒక హిందీ సినిమా కూడా చేస్తున్నారు. హ్రితిక్ రోషన్ ఇందులో ఇంకొక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభం అయింది.
-- సురేష్ కవిరాయని