Jr NTR: అనుపమ్ ఖేర్ పోస్ట్‌తో తార‌క్ ఫ్యాన్స్ అస్సలు ఆగట్లే.. రచ్చ రచ్చే!

ABN , Publish Date - May 01 , 2024 | 03:11 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో తారక్ ఫ్యాన్స్ గర్వపడే ఓ ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్.. తారక్‌ని కలిసి.. అతనంటే ఎంత ఇష్టమో.. సోషల్ మీడియా వేదికగా ఫొటోతో సహా పోస్ట్ చేశారు. ఆయన పోస్ట్‌ ప్రస్తుతం వైరల్ అవుతోంది. తారక్ కూడా ఈ పోస్ట్‌కి స్పందించారు.

Jr NTR: అనుపమ్ ఖేర్ పోస్ట్‌తో తార‌క్ ఫ్యాన్స్ అస్సలు ఆగట్లే.. రచ్చ రచ్చే!
Anupam Kher and Jr NTR

మ్యాన్ ఆఫ్ ద మాసెస్ (Man of the Masses), యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (Young Tiger NTR)కు సంబంధించి ఎటువంటి వార్త అయినా సరే.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా (Social Media) షేకవుతోంది. ప్రస్తుతం తారక్ ఫోకస్ అంతా సినిమాలపై పెట్టడంతో.. మంచి మంచి ప్రాజెక్ట్ ఆయన చేతికి చేరుతున్నాయి. అందులో ఒకటి ‘వార్ 2’ (War 2). ఈ సినిమాతో తారక్ డైరెక్ట్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో తారక్ ఫ్యాన్స్ గర్వపడే ఓ ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher).. తారక్‌ (Tarak)ని కలిసి.. అతనంటే ఎంత ఇష్టమో.. సోషల్ మీడియా వేదికగా ఫొటోతో సహా పోస్ట్ చేశారు.

*Alluri Seetarama Raju: వెండితెరపై కృష్ణ చేసిన సాహసానికి నిదర్శనం 


అంతే, ఈ ఫొటో వచ్చినప్పటి నుంచి.. తారక్ ఫ్యాన్స్‌ (NTR Fans)ని ఆపడం కష్టమవుతోంది. ప్రజంట్ తారక్ పేరు టాప్‌లో ట్రెండ్ అవుతుందంటే.. ఎంతగా ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ అనుపమ్ ఖేర్ ఏం పోస్ట్ చేశారంటే.. ‘‘గత రాత్రి నేను ఎంతో ఇష్టపడే వ్యక్తి, నటుడు తారక్‌ను కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. అతను కష్టపడే విధానం నాకెంతో ఇష్టం. అతని ఎనర్జీ ఇలా ఎప్పుడూ డబుల్ అవుతూనే ఉండాలని కోరుకుంటున్నాను. జయహో..’’ (Anupam Kher Post on Jr NTR) అంటూ తారక్‌తో ఉన్న ఫొటోని ఆర్ఆర్ఆర్ సినిమాలోని దోస్తీ సాంగ్‌తో లింక్ చేస్తూ అనుపమ్ షేర్ చేశారు. ఈ ట్వీట్ చూసిన తారక్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ.. రీ ట్వీట్స్, కామెంట్స్‌తో చెలరేగుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా అనుపమ్ ట్వీట్‌కు స్పందించారు.


jr-ntr.jpg

‘‘మీ పనితీరు మాటల్లో చెప్పలేం... మీరు ఇలాగే భవిష్యత్ తరాల నటులకు కూడా ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను’’ అంటూ అనుపమ్ ఖేర్ ట్వీట్‌కు తారక్ స్పందించారు (Tarak Reaction on Anupam Kher Post). తారక్ పోస్ట్‌ను అనుపమ్ రీపోస్ట్ చేశారు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ (Devara) సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు ‘వార్ 2’ షూటింగ్‌లో పాల్గొంటూ ముంబైలో సందడి చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఓ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది.

Updated Date - May 01 , 2024 | 03:11 PM