Gam Gam Ganesha OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘గం.. గం.. గణేశా’.. ఏ ఓటీటీలో అంటే?
ABN , Publish Date - Jun 20 , 2024 | 04:43 PM
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘గం..గం..గణేశా’ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి వచ్చేసింది.
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా నటించిన ‘గం..గం..గణేశా’ (Gam Gam Ganesha) చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ బాగుందంటూ విమర్శకులు సైతం ప్రశంసించారు. ఇక ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసింది. అసలు ఎలాంటి చడీచప్పుడు లేకుండా.. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలోకి ఈ సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. అమెజాన్ ఆన్ చేయండి.. ఆనంద్ దేవరకొండ అభినయం చూసేయండి..
Also Read- Gam Gam Ganesha Movie Review: ఆనంద్ దేవరకొండకి హిట్ వచ్చిందా?
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. (Gam Gam Ganesha Story) గణేష్ (ఆనంద్ దేవరకొండ) అతని స్నేహితుడు శంకర్ (ఇమ్మాన్యుయేల్) ఇద్దరూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ వుంటారు. గణేష్, శృతి (నయన్ సారిక) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె అతనికి హ్యాండిచ్చి, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. కోపం వచ్చిన గణేష్ చిన్న చిన్న దొంగతనాలు కాదు, ఒక పెద్ద దొంగతనం చేసి సెటిల్ అవ్వాలని అనుకుంటాడు. ఒక బంగారం షాపులో డైమండ్ కొట్టేసి అది అమ్మితే కోట్లు గడించవచ్చు అనుకుంటాడు. నంద్యాలలో కిశోర్ రెడ్డి (రాజ్ అర్జున్) ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి వందకోట్లు డబ్బు కావాలని, ముంబైలో వుండే ఒకతనితో డీల్ కుదుర్చుకుంటాడు. వినాయకచవితి పండగకి గణేష్ విగ్రహంలో ఈ వందకోట్లు పెట్టి ఎవరికీ అనుమానం రాకుండా ముంబై నుండి నంద్యాల తీసుకు వస్తారు. డైమండ్ దొంగతనం చేసి కారులో పారిపోతున్న గణేష్‌కి పోలీసులు వాహనాలను చెక్ చేస్తూ ఉండటం గమనించి, తన దగ్గరవున్న డైమండ్‌ని ముంబై నుండి నంద్యాల వస్తున్న గణేష్ విగ్రహంలో జారవిడుస్తాడు. నంద్యాలకి విగ్రహం వస్తుంది, కానీ అందులో డబ్బు ఉండదు.
డబ్బులు పెట్టి వున్న గణేష్ విగ్రహం కర్నూల్ దగ్గర్లో వున్న ఒక గ్రామానికి చేరుకుంటుంది. డబ్బు కోసం కిషోర్ రెడ్డి మనుషులు, డైమండ్ కోసం గణేష్ అతని స్నేహితుడు, లోకల్‌గా వుండే ఒక పూజారి (జగన్), లోకల్ ఎమ్మెల్యే (సత్యం రాజేష్) ఇలా అందరూ ఆ గణేష్ విగ్రహం కోసం అక్కడ తిష్టవేస్తారు. చివరికి ఏమవుతుంది, విగ్రహంలో డబ్బు దొరికిందా, డైమండ్ స్నేహితులకి చిక్కిందా? ఈ ఎలుక, పిల్లి ఆటలో ఎవరు విజయం సాధించారు తెలుసుకోవాలంటే.. ఓటీటీలోకి వచ్చేసిన ఈ సినిమా చూసేయాల్సిందే.. (Gam Gam Ganesha in Amazon Prime)