HanuMan Producer: ‘హనుమాన్’గా మెగాస్టార్ లేదంటే మెగా పవర్‌స్టార్!
ABN , Publish Date - Jul 06 , 2024 | 10:21 PM
ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకుడు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్ర ప్రమోషన్స్ యమా జోరుగా నిర్మాతలు నిర్వహిస్తున్నారు. జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను నిర్మాత చైతన్య రెడ్డి తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో ‘జై హనుమాన్’ గురించి కూడా ఆమె అప్డేట్ ఇచ్చారు.
ప్రియదర్శి (Priyadarshi), నభా నటేష్ (Nabha Natesh) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘డార్లింగ్’ (Darling). అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్ర ప్రమోషన్స్ యమా జోరుగా నిర్మాతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమా జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో నిర్మాత చైతన్య రెడ్డి (Chaitanya Reddy) మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.
‘హను-మాన్’తో పెద్ద సక్సెస్‌ని అందుకున్నారు.. నిర్మాతగా మీ జర్నీ ఎలా వుంది?
‘హనుమాన్’ పీపుల్ సక్సెస్. మేము ఫలితం ఆశించకుండా మా ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు గొప్ప విజయాన్ని ఇచ్చారు. ఈ రోజుకి కూడా చాలా మంది ‘ఆదివారం వస్తే మా పిల్లలు హనుమాన్ తప్పకుండా చూస్తారు’ అని చెబుతుంటారు. ఇది దేవుడు మాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాం.
‘హనుమాన్’ తర్వాత ‘డార్లింగ్’.. ఏంటి ఇందులో స్పెషల్?
ఇది ‘హనుమాన్’ రిలీజ్‌కి ముందే షూట్ కూడా స్టార్ట్ అయింది. ఈ సబ్జెక్ట్‌కి డైరెక్టర్, ప్రొడ్యూసర్ ముందు కనెక్ట్ అయ్యారు. వాళ్ళది లవ్ మ్యారేజ్, మాది లవ్ మ్యారేజ్. మ్యారేజ్ అయి పద్నాలుగేళ్ళ తర్వాత లైఫ్ చాలా రొటీన్ అయిపోతుంది. సినిమాకి వెళ్ళడం కూడా ఒక పనిగా చూస్తాం. మొదట్లో ఎలా వున్నాం.. పిల్లలు వచ్చాక జీవితంలో బిజీ అయిపోయిన తర్వాత ఎలా ఉంటున్నాం.. ఈ పాయింట్ డైరెక్టర్ అశ్విన్ చెప్పినప్పుడు చాలా కనెక్ట్ అయ్యాం. కంటెంట్ విన్న వెంటనే ఓకే అన్నాం. ఈ జనరేషన్‌కి అర్థమయ్యేలా హ్యుమర్, ఫన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా తీర్చిదిద్దాం. స్పెషలంటే.. ‘డార్లింగ్’ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే ఎంటర్‌టైనర్. (HanuMan Producer Chaitanya Reddy Interview)
ఈ కథకు ప్రియదర్శి, నభా నటేష్‌లను తీసుకోవడానికి కారణం?
హీరోకి చాలా ఇన్నోసెంట్, సింపుల్ బ్యాక్‌గ్రౌండ్ వుండాలి. హీరోయిన్ హైఫై, సోషల్ లైఫ్ యాక్టివ్‌గా వుండాలి. హీరో హీరోయిన్‌కి ఈక్వెల్ ఇంపార్ట్టెన్స్ వుండే క్యారెక్టర్స్. ఈ పాత్రలకు ప్రియదర్శి, నభా పర్ఫెక్ట్ యాప్ట్‌ని భావించాం. ఈ పాత్రలలో లీనమవ్వడానికి రిహర్సల్స్ కూడా చేశారు. చాలా హార్డ్ వర్క్ చేశారు.
‘డార్లింగ్’ చాలా క్యాచి టైటిల్ కదా?
మొదట ‘వై దిస్ కొలవరి’ అనే టైటిల్ అనుకున్నాం. అయితే ‘హనుమాన్’ సక్సెస్ తర్వాత మాకు టైటిల్ ప్రాముఖ్యత తెలిసింది. ‘వై దిస్ కొలవరి’ అంటే కేవలం యూత్‌కే అర్థమౌతుంది. తర్వాత కొన్ని టైటిల్స్ అనుకున్నాం. చివరికి ‘డార్లింగ్’కి ఫిక్సయ్యాం. అయితే డార్లింగ్ పేరుతో ఇప్పటికే సినిమా వుంది. అప్పుడు ‘వై దిస్ కొలవరి’ని ట్యాగ్ లైన్‌గా పెట్టాం. ఎమోషన్, ఎంటర్‌టైన్మెంట్ బ్లెండ్ అయిన చిత్రమిది. కంప్లీట్ ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్ టైనర్.
నభా నటేష్‌కు యాక్సిడెంట్ అయ్యింది కదా. దాని వలన ఈ ప్రాజెక్ట్ ఏదైనా ఎఫెక్ట్ అయ్యిందా?
లేదు. తను మళ్ళీ యాక్టింగ్‌కి బ్యాక్ అయినప్పుడే మేము అప్రోచ్ అయ్యాం. ఈ సినిమాకి తను పెద్ద ఎసెట్. తను చాలా సపోర్టివ్. చాలా స్వీట్. తనది చాలా పాజిటివ్ రోల్. విమెన్ రెస్పెక్ట్ పెంచేలా ఆ పాత్ర వుంటుంది.
డార్లింగ్ సబ్జెక్ట్ కి యూనివర్సల్ అప్పీల్ వుంది. హనుమాన్ పాన్ ఇండియా సక్సెస్. మరి ఈ సినిమాని కేవలం తెలుగుకే పరిమితం చేయడానికి కారణం?
మొదట తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్షకులకు నచ్చి ఆదరిస్తే.. ఇంకా పెద్ద కాస్ట్‌తో రీమేక్ చేయాలనే ఆలోచన వుంది.
‘డార్లింగ్’ అనే పేరు పెట్టారు.. ప్రమోషన్స్‌కి ప్రభాస్‌ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా?
మేము ఆల్రెడీ అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నించాం. కానీ ఆయన ‘కల్కి’తో చాలా బిజీగా వున్నారు. ఆయన టీంకి చాలా సపోర్ట్‌గా వుంటారు.
మ్యూజిక్ డైరెక్టర్ గురించి?
వివేక్ చాలా సపోర్ట్ చేశారు. సూపర్ సాంగ్స్ ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా చేశారు.
సినిమా అనేది ఆర్ట్ ఫారం. మీరు సినిమా, బిజినెస్ ఈ రెండింటిలో వున్నారు.. ఇందులో ఏది ఎక్కువ ఎంజాయ్ చేస్తారు?
లైఫ్‌లో సినిమా చూడకుండా, ఎంటర్‌టైన్మెంట్ లేకుండా గడిచిన రోజు లేదు. యూఎస్‌లో వున్నప్పుడు రోజుకి నాలుగు గంటలు ఏదో కంటెంట్‌ని బ్రౌజ్ చేస్తూనే వుండేవాళ్ళం. సినిమా ఎంటర్‌టైన్మెంట్ లైఫ్‌లో ఒక భాగం అయిపొయింది. ఇప్పుడు అదే ఫీల్డ్‌లో వర్క్ చేయడం ఆనందంగా వుంది. సినిమాతో పోలిస్తే బిజినెస్ మోర్ ఎంజాయ్ చేస్తాను. బిజినెస్ అంతా నేనే చూసుకుంటా. నేను బిజినెస్‌లో క్వాలిఫైడ్. రెండు మాస్టర్స్ చేశాను. టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ వుంది. బిజినెస్‌ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. రెండు రంగాల్లో సక్సెస్ అవ్వడం ఆనందం వుంది. ఈ క్రెడిబిలిటీ అంతా దేవుడికి, మా పేరెంట్స్‌కి ఇస్తాను. నాకు ఫ్యామిలీ సపోర్ట్ వుంది. నిరంజన్ గారు చాలా సపోర్ట్ చేస్తారు.
‘జై హనుమాన్’ ఎంత వరకూ వచ్చింది? సంక్రాంతికేనా రిలీజ్?
‘జై హనుమాన్’ (Jai Hanuman) ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యింది. సంక్రాంతికి పాజిబుల్ అయ్యేలా లేదు. ‘హనుమాన్’కి ఈ రేంజ్ రీచ్‌ని ఊహించలేదు. ఒక మార్వల్ లాంటి స్టోరీ తీసుకోస్తునప్పుడు ఆ రీచ్ వుండాలి కాబట్టి కొంచెం టైం తీసుకుని చేద్దామనేది మా ఆలోచన.
‘హనుమాన్’ పాత్రలో ఏ హీరో కనిపించే అవకాశం వుంది? మీ పర్శనల్ ప్రిఫరెన్స్ ఎవరు?
ఇంకా లేదండీ. అది హనుమంతుడే డిసైడ్ చేస్తారు. ఆ పాత్రలో ఎవరు కనిపిస్తారనేది హనుమంతుల వారికే వదిలేశాం. నా అభిప్రాయం అయితే మాత్రం రామ్ చరణ్ (Ram Charan) గారు లేదా చిరంజీవి (Chiranjeevi) గారు. మేము సినిమా కంటే దేవుడి కథ చెప్పాలని అనుకుంటున్నాం. ఆయన ఎలా చెప్పించుకుంటారనేది ఆయన ఇష్టం. ‘హనుమాన్’ (Hanu Man) సినిమా విషయంలో చిరంజీవిగారి సపోర్ట్‌ని మర్చిపోలేం.
స్టోరీ ఫైనల్ జడ్జిమెంట్ ఎవరిది?
నిరంజన్ గారిదే. ఆయన నాకంటే చాలా క్రియేటివ్. ఆయన సబ్జెక్ట్ సెలెక్షన్ చాలా బాగుంటుంది. ప్రొడక్షన్ సైడ్ నా ఇన్వాల్మెంట్ వుంటుంది.
నెక్స్ట్ లైనప్‌లో ఉన్న సినిమాలు?
చాలా సినిమాలు వున్నాయి. సాయి ధరమ తేజ్ సినిమా అనౌన్స్ చేశాం. ఇంకో పది సినిమాలు ప్రీ ప్రొడక్షన్‌లో వున్నాయి. దాదాపు మూడేళ్ళలో ఈ పది సినిమాలు రిలీజ్‌కి వచ్చేస్తాయి.