Manamey: నాకు కోపం రాదు, పెద్దగా అరవను, కామ్ గా వుంటాను: కృతి శెట్టి
ABN , Publish Date - Jun 01 , 2024 | 10:46 AM
శర్వానంద్, కృతి శెట్టి జంటగా వస్తున్న సినిమా 'మనమే' జూన్ 7న విడుదలవుతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు, నిర్మాత టిజి విశ్వప్రసాద్. ఈ నేపధ్యంలో కథానాయకురాలు కృతి శెట్టి మూవీ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.
'మనమే'లో మీ క్యారెక్టర్ ఎలా వుండబోతోంది ?
ఇందులో నా క్యారెక్టర్ పేరు సుభద్ర. ఇప్పటి వరకూ నేను చేసిన క్యారెక్టర్స్ కి డిఫరెంట్ గా వుంటుంది. నాకు చాలా కొత్తగా వుంటుంది. ఇప్పటివరకూ క్యూట్, సాఫ్ట్, బబ్లీ క్యారెక్టర్స్ చేశాను. కానీ ఈ క్యారెక్టర్ చాలా స్ట్రిక్ట్ గా వుంటుంది. షూటింగ్ సమయంలో డైరెక్టర్ శ్రీరామ్ గారిని ఇంత స్ట్రిక్ట్ గా వుంటుందా?! అని చాలా సార్లు అడిగాను. ఆయన అంత స్ట్రిక్ట్ గా కావాలని చెప్పారు. ఆయన విజన్ ని ఫాలో అయ్యాను. (Krithi Shetty interview about her upcoming film Manamey)
సుభద్ర పాత్రకు మీకు పోలికలు ఉన్నాయా ?
పర్శనల్ గా నాకు పెద్ద కోపం రాదు. పెద్దగా అరవను. చాలా కామ్ గా వుంటాను. సుభద్ర క్యారెక్టర్ నాకు పూర్తిగా కొత్త.
టీజర్ లో బేబీ కనిపిస్తోంది. ఇందులో మదర్ గా కనిపిస్తారా ?
అది తెలీదు. మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది(నవ్వుతూ). సినిమా చూసినప్పుడే నా క్యారెక్టర్ ఏమిటనేది పూర్తిగా తెలుస్తుంది.
శర్వానంద్ గారితో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ఎలా వుంది ?
శర్వానంద్ గారు వన్ అఫ్ ది ఫైనెస్ట్ పెర్ఫార్మర్. నిన్న సినిమా చూశాను. ఆయన ప్రతి సీన్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆయన ఎక్స్ పీరియన్స్ కనిపించింది. ఇందులో నాకు ఓ ఫేవరట్ సీన్ వుంది. ఆ సీన్ కోసం చాలా వెయిట్ చేశాను. ఎలా చేయాలో అని చాలా అలోచించాను. కానీ శర్వానంద్ గారు చాలా కాజ్యువల్ గా వచ్చి ఆ సీన్ ని ఒక్క నిమిషంలో అద్భుతంగా ఫినిష్ చేశారు. నేను స్టన్ అయిపోయాను. శర్వానంద్ గారు పెర్ఫార్మెన్స్ ని మ్యాచ్ చేయడం చాలా కష్టం. తనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంటుంది. అందులో ఒక బేబీ కూడా వుంది. బేబీ తో షూట్ చేయడం అంత ఈజీ కాదు. అయితే శర్వానంద్ గారు చాలా బ్యూటీఫుల్ గా హ్యాండిల్ చేశారు. చాలా సపోర్ట్ చేశారు.
డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గారు కథ చెప్పినపుడు మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి ?
'మనమే' స్ట్రాంగ్ ఎమోషన్ కనెక్ట్ వున్న ఎంటర్ టైనింగ్ ఫిల్మ్. ఇందులో వండర్ ఫుల్ కిడ్, పేరెంట్ ఎమోషన్ వుంది. అది గ్లోబల్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా మా ముగ్గురి క్యారెక్టర్స్ చుట్టూ వుంటుంది. అందుకే మనమే అనే పేరు పెట్టాం. ఇది పెర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అందరికీ కనెక్ట్ అవుతుంది. ప్రతి సీన్ లో ఎంటర్ టైన్మెంట్ వుంటుంది.
'ఉప్పెన'లో బేబమ్మ క్యారెక్టర్ కి వచ్చిన రెస్పాన్స్, ఇందులో సుభద్ర క్యారెక్టర్ కి వస్తుందా?
రావాలనే కోరుకుంటున్నాను. అది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపైనే వుంటుంది. 'ఉప్పెన' రస్టిక్ లవ్ స్టొరీ. మనమే ఒక రొమ్ -కాం. 'మనమే' లో నా క్యారెక్టర్ లో మంచి ఎమోషన్ వుంది. అది ప్రేక్షకులుకి నచ్చుతుందనే ఆశిస్తున్నాను.
మనమేలో మ్యూజిక్ ఎలా వుంటుంది ?
హేశం గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. పాటలన్నీ ఆకట్టుకుంటాయి. టప్పా టప్పా మంచి డ్యాన్స్ నెంబర్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది.
ఈ సినిమా మేజర్ పార్ట్ ఎబ్రాడ్ లో షూట్ చేయడం ఎలా అనిపించింది?
లండన్ లో షూట్ చేశాం. లండన్ వెదర్ చాలా అన్ ప్రెడిక్టిబుల్ గా వుంటుంది. మేము షూట్ చేసిన హౌస్ లో చాలా విండోస్ వుంటాయి. ఒక ఫ్రేం సెట్ చేశాక లైట్ మారిపోతుంది. సడన్ గా వర్షం పడుతుంది. మళ్ళీ లైట్ వచ్చేవరకూ వెయిట్ చేయాలి. ఇది చాలా డిఫికల్ట్ ప్రాసస్.
సక్సెస్ ఫెయిల్యూర్స్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు ?
సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతిలో వుండదు. మన చేతిలో లేని విషయాలు గురించి ఎక్కువగా ఆందోళన చెందకూడదని ఈ ప్రయాణంలో నేర్చుకున్నాను.
మీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనీ వుంటుంది ?
నాకు ప్రిన్సెస్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం. 'బాహుబలి' లో అనుష్క గారి లాంటి క్యారెక్టర్స్. అలాగే యాక్షన్ , మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ వున్న రోల్స్ చేయాలని వుంది.
అప్ కమింగ్ ఫిల్మ్స్ ?
మూడు తమిళ్ ఫిలిమ్స్ చేస్తున్నాను. అలాగే టోవినో థామస్ తో ఒక మలయాళం ఫిల్మ్ చేస్తున్నాను.