Rashmika Mandanna: ఆనంద్ దేవరకొండలో ఆ నవ్వు చూడాలని కోరుకుంటున్నా..
ABN , Publish Date - May 28 , 2024 | 09:55 AM
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 31న విడుదల కాబోతోన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అతిథిగా హాజరయ్యారు.
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గం..గం..గణేశా’ (Gam Gam Ganesha). ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి (Uday Shetty) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైన నేపథ్యంలో మేకర్స్ తాజాగా ప్రీ రిలీజ్ వేడుకను (Gam Gam Ganesh Pre Release Event) గ్రాండ్‌గా నిర్వహించారు. ఆనంద్ దేవరకొండ ఇంతకు ముందు నటించిన సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు గెస్ట్‌గా వచ్చిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) మరోసారి ఈ సినిమా వేడుకకు ముక్య అతిథిగా హాజరయ్యారు.
*Mahesh-Namrata: ఈరోజు తల్లిదండ్రులుగా ఎంతో గర్వపడుతున్నాం.. మహేష్, నమ్రతల ఇన్‌స్టా పోస్ట్స్ వైరల్
ఈ కార్యక్రమంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మాట్లాడుతూ.. ‘గం..గం..గణేశా’ (Gam Gam Ganesha Movie) సినిమా.. ఈ టీమ్ అందరికీ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. మనకంటూ ఒకరి సపోర్ట్ ఉండాలి. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక నేను అది ఫీలయ్యాను. ఆనంద్ నాకు ఒక బ్రదర్. అతనికి తెలియదు అతని మీద నేను చాలా డిపెండ్ అవుతుంటాను. ఈ సినిమా సక్సెస్ అందుకుంటే ఆనంద్ (Anand) మొహంలో నవ్వు ఉంటుంది. ఆ నవ్వు చూడాలని కోరుకుంటున్నా. ‘గం..గం..గణేశా’ సాంగ్స్‌కు నేను డ్యాన్సులు చేశా. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ చాలా బాగుంది. డైరెక్టర్ ఉదయ్‌కు ఈ సినిమా బిగ్ సక్సెస్ అవ్వాలి. ఈ సినిమాలో రుద్ర, ఇమ్మాన్యుయేల్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ఇమ్మాన్యుయేల్ వీడియోస్ చూస్తే నవ్వు ఆగదు. ప్రొడ్యూసర్స్ వంశీ, కేదార్, అనురాగ్‌కు ఈ సినిమా లాభాలు తీసుకురావాలి. ‘బేబి’ మూవీ చూశాక సాయి రాజేశ్ గారి డైరెక్షన్లో తప్పకుండా నటించాలని అనిపించిందని చెప్పుకొచ్చారు.
ఇదే కార్యక్రమంలో రష్మికకు ఆనంద్ దేవరకొండ కొన్ని ప్రశ్నలు సంధించారు. అందులో ముఖ్యంగా మీతో కలిసి నటించిన హీరోల్లో మీ ఫేవరెట్ ఎవరు? అని ఆనంద్ అడిగిన ప్రశ్నకు.. రష్మిక తిట్టుకుంటూనే.. ‘ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ ఇలా ఇరికిస్తే ఎలా?’ అని చెబుతూ.. రౌడీ (Rowdy)నే అని ఆన్సర్ ఇచ్చింది. దీంతో స్టేడియం ఒక్కసారిగా మోతమోగింది. ఇదంతా చూసిన వారు.. రష్మిక మళ్లీ హింట్స్ ఇచ్చేసిందంటూ సోషల్ మీడియాలో ఈ వీడియోని షేర్ చేస్తుండటం విశేషం.
Read Latest Cinema News