Kannappa: మంచు వారసుడు అవ్రామ్ దర్శనం.. ఆ రోజే!

ABN , Publish Date - Aug 23 , 2024 | 06:02 PM

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ప్రతీ సోమవారం ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్‌ను మేకర్స్ ఇస్తోన్న విషయం తెలిసిందే. ‘కన్నప్ప’లోని కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ.. సినిమా విడుదల తర్వాత ఆ పాత్రల పేర్లతో ప్రేక్షకులు కన్ఫ్యూజ్ కాకుండా ఉండేలా ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మంచు వారసుడు అవ్రామ్ లుక్‌ను సోమవారం విడుదల చేయబోతున్నారు.

Kannappa Avram Manchu

విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ప్రతీ సోమవారం ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేలా మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ‘కన్నప్ప’లోని కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ.. సినిమా విడుదల తర్వాత ఆ పాత్రల పేర్లతో ప్రేక్షకులు కన్ఫ్యూజ్ కాకుండా ఉండేలా ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ వస్తున్నారు. ఇక రాబోయే కృష్ణ జన్మాష్టమి (Krishna Janmashtami)‌ని పురస్కరించుకుని సోమవారం.. ఓ స్పెషల్ పాత్రకి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేయబోతున్నారు. స్పెషల్ పాత్ర అనగానే అంతా ప్రభాస్ అనుకుంటారేమో.. ఎందుకంటే ఇందులో స్పెషల్ రోల్స్ చాలా మంది స్టార్స్ పోషిస్తున్నారు. ఇక విషయంలోకి వస్తే.. (Avram Manchu First Look)

Also Read- Cinema Review: మారుతీనగర్‌ సుబ్రమణ్యం

కృష్ణాష్టమి సందర్భంగా మంచు విష్ణు తనయుడు అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్‌ను రివీల్ చేయబోతున్నారు. ‘కన్నప్ప’లో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న అవ్రామ్.. ఈ సినిమాతో మంచు వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. మంచు వారి మూడు తరాలు ఇందులో కనిపించబోతున్నాయి. మోహన్ బాబు, విష్ణు మంచు, అవ్రామ్ మంచు (Avram Manchu) కలయికతో ఈ చిత్రం మరింత స్పెషల్ కానుంది. అవ్రామ్ పాత్ర, సినిమాలో లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మరో 3 రోజులు ఆగాల్సిందే అంటున్నారు మేకర్స్. కచ్చితంగా అవ్రామ్ తన లుక్‌తో అందరినీ సర్‌ప్రైజ్ చేస్తాడని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.


Avram-Manchu.jpg

విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తోన్న ఈ ‘కన్నప్ప’ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రాబోతోంది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌లో ఈ సినిమా‌ను పాన్‌ ఇండియా వైడ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పూర్తి చేసి.. ఒకవైపు ప్రమోషన్ కార్యక్రమాలు, మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు స్టార్ట్‌ చేయనున్నారు. డా. మోహన్ బాబు (Dr Mohan Babu) నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకుడు.

Read Latest Cinema News

Updated Date - Aug 23 , 2024 | 06:02 PM

Kannappa : కదిలొచ్చిన కన్నప్ప

Kannappa : కన్నప్ప కోసం కాజల్‌

Kannappa The Movie: మొన్న ముండ‌డు, నిన్న చుండ‌డు, నేడు కంప‌డు! క‌న్న‌ప్ప నుంచి మ‌రో అప్డేట్

Kannappa The Movie: ‘కన్నప్ప’ నుంచి.. ‘ముండడు’ లుక్ రిలీజ్‌

Kannappa: కన్నప్ప మూవీ నుంచి మధుబాల లుక్ రిలీజ్