NTR Birth Anniversary: ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నందమూరి ఫ్యామిలీ నివాళులు

ABN , Publish Date - May 28 , 2024 | 11:11 AM

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు 101వ జయంతి (May 28) సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, తెదేపా నేతలు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ ఎన్టీఆర్‌కు అంజలి ఘటించారు.

NTR Birth Anniversary: ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నందమూరి ఫ్యామిలీ నివాళులు
NTR Family Members at NTR Ghat

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు 101వ జయంతి (May 28) సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, తెదేపా నేతలు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ ఎన్టీఆర్‌కు అంజలి ఘటించారు (NTR Birth Anniversary). తెలుగు ప్రజల ఆరాధ్యదైవమైన నందమూరి తారక రామారావు (NT Ramarao) జయంతి, వర్ధంతి వేడుకలను నందమూరి ఫ్యామిలీ మెంబర్స్, తెలుగు తమ్ముళ్లు ఎంత గ్రాండ్‌గా నిర్వహిస్తూ వస్తున్నారో తెలియంది కాదు. ఆయన శతజయంతి ఉత్సవాలను దాదాపు ఏడాదిపాటు నిర్వహించారంటే.. ఆయనని ఎంతగా తెలుగు తమ్ముళ్లు గుండెల్లో పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయనకు మరణం లేదు. మరణం లేని మనిషి, మహానుభావుడు నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao).

Balayya.jpg

ఆ తారక రాముని 101వ జయంతిని (NTR 101st Birth Anniversary) పురస్కరించుకుని నందమూరి కుటుంబ సభ్యులు (Nandamuri Family Members), అభిమానులు, తెలుగు తమ్ముళ్లు ఎన్టీఆర్ ఘాట్‌ (NTR Ghat)ని సందర్శిస్తున్నారు. కుమారులు నటసింహం బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ.. కుమార్తె పురందేశ్వరి (Daggubati Purandeswari) ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద తమ తండ్రికి ఘనంగా అంజలి ఘటించారు. అనంతరం పురందేశ్వరి మాట్లాడుతూ.. రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన నేత ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్‌తోనే తెలుగువారి సత్తా ప్రపంచానికి తెలిసిందని అన్నారు. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడని, ఎన్టీఆర్ అంటే సినీ, రాజకీయ రంగంలో ప్రభంజనమని కొనియాడారు. ఆయన స్పూర్తితో ముందుకు వెళతామని దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు.

Purandeswari.jpg


*Mahesh-Namrata: ఈరోజు తల్లిదండ్రులుగా ఎంతో గర్వపడుతున్నాం.. మహేష్, నమ్రతల ఇన్‌స్టా పోస్ట్స్ వైరల్

తన అన్న కళ్యాణ్ రామ్‌ (Kalyan Ram)తో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR).. తాతకు నివాళులు అర్పించారు. ఉదయాన్నే ఎన్టీఆర్ ఘాట్‌ వద్దకు చేరుకున్న ఆయన పుష్పగుచ్ఛాలు సమర్పించి అంజలి ఘటించారు. ప్రతి సంవత్సరం తారక్, కళ్యాణ్ రామ్ కలిసి వచ్చి ఇలా అంజలి ఘటిస్తారనే విషయం తెలిసిందే. వారు వస్తారని తెలుసుకున్న అభిమానులు తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ ఘాట్‌కి చేరుకుని సందడి చేశారు.

jr-ntr.jpg

అంతకు ముందు ట్విట్టర్ వేదికగా తారక్ తన తాతకు నివాళులు అర్పించారు. ‘‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను..’’ అంటూ ఎన్టీఆర్ ఓ పోస్టర్‌ని ట్వీట్ (Jr NTR Tweet) చేశారు.

Read Latest Cinema News

Updated Date - May 28 , 2024 | 11:11 AM