MAA: ప్రణీత్ హనుమంతు ఎఫెక్ట్.. రంగంలోకి ‘మా’- 5 యూట్యూబ్ ఛానల్స్‌పై కొరడా..
ABN , Publish Date - Jul 13 , 2024 | 04:49 PM
ఇటీవల ఓ వీడియోలో తండ్రీ కుమార్తె బంధాన్ని అపహాస్యం చేస్తూ ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ చేసిన కామెంట్స్ పలువురికి ఆగ్రహాన్ని తెప్పించిన విషయం తెలిసిందే. అతనిపై సెలబ్రిటీలెందరో ఫైరవుతూ ప్రభుత్వాలకు కంప్లయింట్ చేశారు. అతనిని అరెస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం ప్రణీత్ హనుమంతులాంటి వారిని ఏరేసే పనిలో భాగంగా ‘మా’ యాక్షన్ షురూ చేసింది. 5 యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేసి.. మరో హెచ్చరికను జారీ చేసింది.
గతం వారం రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న పేరు ప్రణీత్ హనుమంతు (Praneeth Hanumantu). యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్‌గా కొంత మంది ప్రేక్షకులకు, నెటిజన్లకు పరిచయమైన ప్రణీత్ హనుమంతు.. ఇటీవల ఓ వీడియోలో తండ్రి కుమార్తె బంధాన్ని అపహాస్యం చేస్తూ చేసిన కామెంట్స్ పలువురికి ఆగ్రహాన్ని తెప్పించాయి. అతని వ్యాఖ్యలు సొసైటీకి ప్రమాదం అని భావించిన హీరో సాయి దుర్గా తేజ్.. వెంటనే సోషల్ మీడియా వేదికగా అతనిపై, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, పోలీస్ ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేశారు. సాయి దుర్గా తేజ్ పోస్ట్ అనంతరం.. ఈ ఇష్యూపై సెలబ్రిటీలెందరో గళం విప్పి.. వెంటనే ప్రక్షాళన చేయాలని ప్రభుత్వాలను, అధికారులను కోరారు. ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఇష్యూ ఇరు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అవడంతో రెండు ప్రభుత్వాలు స్పందించి.. వెంటనే ప్రణీత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రణీత్ హనుమంతు ఎఫెక్ట్‌తో ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Movie Artist Association) కూడా అలెర్టయింది. ఆర్టిస్ట్‌లపై లేనిపోని రాతలు, వీడియోలతో రెచ్చిపోతున్న యూట్యూబ్ ఛానల్స్‌పై కొరడా ఝళిపించేందుకు రంగం సిద్ధం చేసింది.
Also Read- Tollywood Hero: ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టారా? టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరో?
ప్రణీత్ హనుమంతు ఇష్యూ సమయంలో ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు స్పందిస్తూ.. ఇలాంటి వారి రాతల కారణంగా ఆర్టిస్ట్‌లు ఎంతగా నలిగిపోతున్నారో తెలుపుతూ ఓ వీడియోని విడుదల చేశారు. అంతేకాదు, ఈ రాతలు, వీడియోలను క్రియేట్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక కూడా చేశారు. ఆయన హెచ్చరించినట్లుగానే.. ఇప్పుడు ఓ ఐదు యూట్యూబ్ ఛానళ్లపై కొరడా ఝళిపించారు. తాజాగా ‘మా’ (Maa) అధికారిక ట్విట్టర్ ద్వారా మరోసారి యూట్యూబ్ ఛానళ్లకు హెచ్చరికను జారీ చేశారు.
ప్రక్షాళన మొదలైంది. నటీనటులు, వారి కుటుంబాలు మరియు వ్యక్తిగత దాడులకు తెగబడుతూ అవమానకరమైన వ్యాఖ్యలతో పోస్ట్‌లు పెడుతున్న ఐదు యూట్యూబ్ ఛానెళ్లను (Five YouTube Channels) తొలగించడం జరిగింది. ఇది ప్రారంభం మాత్రమే. ఇకపై మేము చర్యలు తీసుకునే వారి జాబితాను ఎప్పటికప్పుడు తెలియజేస్తాము.. అంటూ యూట్యూబ్ ఛానళ్ల ఓనర్స్‌కి ‘మా’ ట్విట్టర్ వేదికగా హెచ్చరికను (Maa Warning to Youtubers) జారీ చేశారు. అంతేకాదు, తొలగించబడిన 5 యూట్యూబ్ ఛానళ్ల వివరాలను కూడా ఇందులో తెలియజేశారు.
Read Latest Cinema News